Search
  • Follow NativePlanet
Share
» »సంతానం, సుమంగళి యోగాన్ని ప్రసాదించే పార్వతి దేవి ప్రతిష్టించిన శివ రూపం

సంతానం, సుమంగళి యోగాన్ని ప్రసాదించే పార్వతి దేవి ప్రతిష్టించిన శివ రూపం

By Kishore

ఘృశ్నేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఘృశ్నేశ్వరలింగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా గుహలకు కేవలం కూతవేటు దూరంలోనే ఉంది. ఈ శివలింగాన్ని ఆదిదంపతుల్లో ఒకరైన పార్వతి దేవి స్వయంగా ప్రతిష్టించారని శివపురాణం చెబుతుంది. ఈ ఘృశ్నేశ్వరుడిని సందర్శించుకుంటే దంపతులకు సంతానయోగం కలుగుతుందని చెబుతారు. అంతేకాకుండా మహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ప్రతీతి. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా చాలా ప్రాచుర్యం చెందినది. ఘృశ్నేశ్వర లింగం సమీపంలో ఉన్న శివతీర్థంలోని నీటి వల్ల చర్మవాదులన్నీ సమిసిపోతాయని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడన్న పేరు కూడా ఉంది. ఎల్లోరా గుహలను సందర్శించిన ప్రతి ఒక్క హిందువూ ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొంటూ ఉంటాడు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం వివరాలు మీ కోసం

కర్నాటక కాశ్మీర్ ను చూశారా?

ఆర్థిక కష్టాలన్నీ తీర్చే శయనించిన స్థితిలోని హనుమ

1. దేవగిరి దుర్గం

1. దేవగిరి దుర్గం

Image Source:

పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అనే వారు. ఇక్కడ పరమ శివభక్తుడైన సుధర్మడనే బ్రహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ప్రతి రోజూ ఆ పరమశివుడిని పూజించనిదే పచ్చి గంగను కూడా ముట్టేవారు కాదు.

2.సంతానం లేదు

2.సంతానం లేదు

Image Source:

అయితే వారికి సంతానం లేదు. ఈ నేపథ్యంలో సుదేహ తన చెల్లలైన ఘుష్మను భక్తకు ఇచ్చి వివాహం చేయాలని భావిస్తుంది. దీనికి భర్త అంగీకరించడు. ఎంత అక్కా చెల్లెల్లు అయినా సవితలుగా మారితే ఇబ్బందులు తలెత్తుతాయని భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు.

3. సుదేహ వినదు

3. సుదేహ వినదు

Image Source:

అయితే సుదేహ వినదు. ఏమి జరిగినా తామిద్దరం ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటామని ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడబోమని చెబుతుంది. దీంతో సుధర్ముడు తనకు ఇష్టం లేకపోయినా ఘుష్మను వివాహం చేసుకొంటాడు.

4. సంతానం కలిగిన తర్వాత

4. సంతానం కలిగిన తర్వాత

Image Source:

మొదట్లో ఇద్దరూ బాగానే ఉంటారు. అయితే ఘుష్మకు సంతానం కలిగుతుంది. అంతేకాకుండా వారు గొప్ప విద్యావంతులవుతారు. దీంతో ఇరుగుపొరుగువారంతా ఘుష్మను, సుధర్మడుని పొగుడుతూ ఉంటారు.

5. చంపి తీర్థంలో పడేస్తుంది

5. చంపి తీర్థంలో పడేస్తుంది

Image Source:

దీంతో సుదేహకు ఈర్ష కలుగుతుంది. ఒక రోజున ఘుష్మసంతానాన్ని చంపి శివతీర్థంలో పడేస్తుంది. ఈ విషయం తెలియని ఘుష్మ తన ఆరాధ్య దైవమైన శివుడిని స్తుతించడమే కాకుండా తనకు తీరని అన్యాయం చేశావని నిందిస్తుంది.

6. బోళా శంకరుడు ప్రత్యక్షమయ్యి

6. బోళా శంకరుడు ప్రత్యక్షమయ్యి

Image Source:

దీంతో బోళ శంకరుడైన పరమశివుడు ప్రత్యక్షమయ్యి జరిగిన విషయం మొత్తం చెప్పి సుదేహను తన త్రినేత్రంతో భస్మం చేయడానికి ఉపక్రమిస్తాడు. అయితే ఘుష్మ తన అక్క వల్లే మీ దర్శన భాగ్యం కలిగిందని అందువల్ల సుదేహను చంపకుండా వదిలిపెట్టాల్సిందిగా ప్రాధేయపడుతుంది.

7. వరం కోరుకోమంటాడు

7. వరం కోరుకోమంటాడు

Image Source:

భక్తురాలి మాటను మన్నించి శివుడు సుదేహను సంహరించకుండా వదిలిపెడుతాడు. అటు పై చనిపోయిన ఘుష్మ సంతానాన్ని బతికిస్తాడు. నిస్వార్థపరులైన భక్తురాలైన ఘష్మను మరో వరం కోరుకోమంటారు.

8. ఆమె పేరుపై

8. ఆమె పేరుపై

Image Source:

దీంతో తన పేరు పై మీరు ఇక్కడ కలియుగాంతం వరకూ కొలువై ఉండాలని కోరుకొంటుంది. అంతేకాకుండా మిమ్ములను సందర్శించినవారికి, పూజించేవారి వంశం గంపెడు సంతానం కలగాలని కోరుకొంటుంది.

9. సంతానాభివ`ద్ధి

9. సంతానాభివ`ద్ధి

Image Source:

దీంతో పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలుస్తాడు. అప్పటి నుంచి ఆ పరమశివుడిని ఘశమేశుడని భక్తులతో నిరాజనాలు అందుకొంటాడు. కాలక్రమంలో ఘశమేశుడు కాస్త ఘృశ్నశ్వరుడిగా మారిపోయాడు. అందువల్లే ఇక్కడ స్వామివారిని కొలిస్తే సంతానాభివృద్ధి కలుగుతుందని చెబుతారు.

10. శివపురాణం ప్రకారం

10. శివపురాణం ప్రకారం

Image Source:

పూర్వం ఈ ప్రాంతాన్ని కామ్యకావనం అని పిలిచేవారు. ఒక రోజు శివుడు, పార్వతి ఈ వనంలో ఏకంతంగా విహరిస్తున్న సమయంలో పార్వతికి దాహం వేసింది. ఆ సమయంలో శివుడు పాతాళం నుంచి గంగను బయటకు తీసుకువచ్చి ఆమె దాహం తీరుస్తాడు.

11. శివతీర్థంగా

11. శివతీర్థంగా

Image Source:

గంగ బయటకు ఉబికి వచ్చిన చోటునే ప్రస్తుతం శివ తీర్థంగా పేర్కొంటారు. ఇక పార్వతి దేవి తన నుదుటన అలంకరించుకోవడానికి శివతీర్థంలోని నీటిని ఒక చేతిలో తీసుకొని మరో చేతిలో కుంమను తీసుకొని రెండింటిని కలుపుతుంది.

12. జ్యోతి పుడుతుంది

12. జ్యోతి పుడుతుంది

Image Source:

అయితే ఆ శివ తీర్థంకు ఉన్న శక్తి వల్ల పార్వతి దేవి చేతి నుంచి ఒక దివ్య జ్యోతి పుడుతుంది. పార్వతి దేవి వెంటనే ఆ దివ్యజ్యోతిని దగ్గర్లో ఉన్న ఒక రాతి శివలింగంలో ప్రవేశపెడుతుంది. సాక్షాత్తు ఆ జగన్మత ప్రతి రూపమైన పార్వతి దేవి ప్రతిష్టించిన లింగం కాబట్టే దీనికి అతీత శక్తులు ఉన్నాయని చెబుతారు.

13. తల్లిదండ్రులయ్యే యోగం

13. తల్లిదండ్రులయ్యే యోగం

Image Source:

ముఖ్యంగా ఆది దంపుతుల్లో ఒకరైన పార్వతిదేవి ప్రతిష్టించిన శివలింగం కనుక ఇక్కడి స్వామివారిని సందర్శించుకున్న దంపతులకు త్వరలో తల్లిదండ్రులయ్యే యోగం ఉందని స్థలపురాణం చెబుతుంది.

14. దీర్ఘసుమంగళిగా

14. దీర్ఘసుమంగళిగా

Image Source:

ఇక కుంకుమ తయారీ సమయంలో ఈ జ్యోతిర్లింగం ఏర్పడటం వల్ల ఇక్కడ ఉన్న పరమేశ్వరుడికి కుంకుమేశ్వరుడనే పేరు కూడా వచ్చింది. ఈ లింగాన్ని దర్శించినా, ఆరాధించినా మమహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారని స్థానక పూజారులు చెబుతున్నారు.

15. చర్మవాదులు పోగొట్టే

15. చర్మవాదులు పోగొట్టే

Image Source:

ఇక్కడ ఉన్న శివతీర్థానికి చర్మవాధులు పోగొట్టే శక్తులు ఉన్నట్లు చెబుతారు. ఇందుకు సంబంధించి పురాణ కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని ఏల్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకసారి రాజు వేటకు వెలుతాడు.

16. సర్వాంగాల్లో పురుగులు

16. సర్వాంగాల్లో పురుగులు

Image Source:

విచక్షణను మరిచి క్రూరమృగాలతో పాటు అడవుల్లోని మునిపుంగవుల ఆశ్రమాల్లోని సాధు జంతువులను కూడా వేటాడి వాటి చావుకు కారణమవుతాడు. దీంతో మునిపుంగవులు ఏల్ రాజు సర్వాంగాల్లో పురుగులు పడి కృంగి కృషించి చనిపోవాలని శాపం పెడుతారు.

17. వికృతంగా

17. వికృతంగా

Image Source:

దీంతో ఏల్ అతి వికృతంగా మారిపోతాడు. దీంతో రాజ్యానికి తిరిగి వెళ్లలేక ఆడవుల్లోనే తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతూ శివతీర్థం వద్దకు వస్తాడు. దాహం వేసి అందులో ఉన్న నీటిని తాగుతాడు.

18. రాజు పూర్వ రూపం దాలుస్తాడు

18. రాజు పూర్వ రూపం దాలుస్తాడు

Image Source:

ఆశ్చర్యంగా అతని సర్వాంగల్లోని పురుగులు నశించి పుండ్లు మానిపోతాయి. రాజు పూర్వ రూపం దాలుస్తాడు. అందువల్లే ఈ శివతీర్థంలో నీటిని తాకినా, శరీరం పై వేసుకొన్న చర్మరోగాలన్నీ నయమవుతాయని స్థానికుల కథనం.

19. ఎక్కడ ఉంది.

19. ఎక్కడ ఉంది.

Image Source:

ప్రపంచ ప్రఖాతి గాంచిన, యునెస్కో వారి సంరిక్షించబడే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేర్కొనే ఎల్లోరా గుహలకు ఒక కిలోమీటరు దూరంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘశ్నేశ్వరాలయం ఉంది. ఎల్లోరా గుహలను సందర్శించే హిందూ పర్యాటకులు తప్పక ఈ దేవాలయాలన్ని సందర్శింస్తుంటారు.

20. ఎలా వెళ్లాలి.

20. ఎలా వెళ్లాలి.

Image Source:

ఎల్లోరా గుహల నుంచి ఇక్కడకు చాలా మంది నడక ద్వారానే చేరుకొంటూ ఉంటారు. లేదంటే ఆటోలు కూడా దొరుకుతాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఈ పుణ్యక్షేత్రానికి 30 కిలోమీటర్లదూరం. బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా ముంబై నుంచి 300 కిలోమీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X