• Follow NativePlanet
Share
» »తడిచిన అందాలను చూడాలంటే...గోవాకే వెళ్లాల్సిన అవసరం లేదు

తడిచిన అందాలను చూడాలంటే...గోవాకే వెళ్లాల్సిన అవసరం లేదు

Written By: Kishore

వేసవి సెలవుల్లో చాలా మంది సముద్ర తీర ప్రాంతాలను తమ పర్యాటక కేంద్రాలుగా ఎంచుకొంటారు. అయితే చాలా మందికి బీచ్ లు అన్న తక్షణం మదిలో మెదిలేది గోవానే. ఇందుకు కారణం లేక పోలేదు. కొంత విచ్చలివిడి తనంతో పాటు విదేశీయులు ఎక్కువగా వస్తుండటం కూడా ఇందుకు ఒక కారణం. ఇక్కడ చాలా బీచ్ లలో విదేశీయులు అర్థనగ్నంగా కనిపిస్తుంటారు. మరోవైపు గోవాలో మద్యం చాలా తక్కువ ధరకు దొరకడమే కాకుండా వివిధ దేశాలకు చెందిన బ్రాండ్స్ కూడా అందుబాటులోనే దొరుకుతాయి. ఇక బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ కూడా ఎక్కువ. దీంతో చాలా మంది బీచ్ లు అనగానే గోవాకు వెళ్లి పోతుంటారు. అయితే సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక బీచ్ లు ఉన్నాయి. ఇక్కడ కూడా వారాంతాల్లో ముఖ్యంగా వేసవి సెలవుల్లో మనం ఎంజాయ్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీచ్ లకు సంబంధించిన పూర్తి సమాచారం మీ కోసం...

కోర్కెలు తీర్చే వారంతా ఒకే చోట... కోటికి ఒక్కరు తక్కువ

1. రిషికొండ బీచ్

1. రిషికొండ బీచ్

Image Source:

సముద్ర తీర ప్రాంతాల్లో వేసవి సెలవులను గడపాలనుకొనే వారికి బీచ్ ల నగరంగా పేరుగాంచిన వైజాగ్ రా రమ్మంటూ స్వాగతం పలుకుతోంది. ఈ నగరంలో చాలా బీచ్ లు ఉన్నప్పటికీ రిషికొండ బీచ్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంటుంది. ఈ బీచ్ విశాఖ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ నగరం నుంచి ఇక్కడకు షేరింగ్ ఆటోలు కూడా దొరుకుతాయి. వారాంతాల్లో కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. వాటర్ స్పోర్ట్స్ కు కూడా ఈ బీచ్ చాలా అనుకూలమైనది.

2.భీమిలి బీచ్

2.భీమిలి బీచ్

Image Source:

విశాఖ పట్టణానికి దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీమిలీ బీచ్ ప్రశాంతతను కోరుకొనే వారిని ఎక్కువగా ఆకర్షిసస్తోంది. ఈ బీచ్ ఈత నేర్చుకొనేవారికి కూడా సురక్షితం. ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి.

3. రామకృష్ణ బీచ్

3. రామకృష్ణ బీచ్

Image Source:

విశాఖపట్టణంలో పేరొందిన బీచ్ లలో రామకృష్ణ బీచ్ ముందు వరుసలో ఉంటుంది. సహజమైన అందాలతో, కొబ్బరి చెట్లతో, బంగారు వర్ణపు ఇసుక తెన్నెలతో ఉన్న ఈ బీచ్ పర్యాటకులకు మంచా ఆటవిడుపు. ఈ బీచ్ కు సమీపంలో కాళీమాత ఆలయం కూడా ఉంది. అయితే ఈ బీచ్ ఈతకు అనుకూలం కాదు. దగ్గర్లోనే సబ్ మెరైన్ మ్యాజియం కూడా సందర్శించవచ్చు.

4. గంగవరం బీచ్

4. గంగవరం బీచ్

Image Source:

గంగవరం బీచ్ విశాఖ పట్టణంలోని స్టీల్ ప్లాంట్ కు దగ్గరగా ఈ బీచ్ ఉంటుంది. ఇక్కడ సినీ, సీరియల్ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

5. మంగినపూడి బీచ్

5. మంగినపూడి బీచ్

Image Source:

మచిలీపట్నం (బందర్) కు ఈ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సముద్రపు లోతు తక్కువ. అందువల్ల ఎక్కువ మంది ఈత కొట్టడానికి ఇక్కడకు వస్తుంటారు. ఈ సముద్ర తీరంలోనే పురాతన శివాలయం, దత్తాత్రేయ ఆశ్రమం ఉంటుంది. ఈ బీచ్ కు దగ్గర్లో లింగాకారంలో ఉన్న 12 బావులు ఉంటాయి. ఒక్కొక్క బావిలోని ఒక్కొక్క రుచిలో ఉండటం ఇక్కడ విశేషం.

6. సూర్యలంక బీచ్

6. సూర్యలంక బీచ్

Image Source:

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో సూర్యలంక బీచ్ ఉంటుంది. వారాంతపు సెలవులను గడపడానికి ఈ బీచ్ చాలా అనుకూలంగా ఉంటుంది. విజయవాడ ఒంగోలు నుంచి సులభంగా సూర్యలంక బీచ్ కు చేరుకోవచ్చు.

7. ఓడరేవు బీచ్

7. ఓడరేవు బీచ్

Image Source:

ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఓడరేవు బీచ్ ఉంటుంది. వారాంతపు సెలవులను ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ మంది ఇక్కడు వస్తుంటారు. చీరాల బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి బస్సలు, ఆటోలలో బీచ్ కు సులభంగా చేరుకోవచ్చు.

8. కొత్తపట్నం బీచ్

8. కొత్తపట్నం బీచ్

Image Source:

కొత్తపట్నం బీచ్ ఒంగోలు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులను గడపడానికి ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

9.మోటుపల్లి బీచ్

9.మోటుపల్లి బీచ్

Image Source:

చీరాల నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో మోటుపల్లి బీచ్ ఉంటుంది. ఇది అత్యంత పురాతమైన బీచ్. బౌద్ధమత స్థూపాలు, విహారాలకు మోటుపల్లి ప్రసిద్ధి. మోటుపల్లిలో పురాతమైన శ్రీరాముడి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు.

10. ఉప్పాడ బీచ్

10. ఉప్పాడ బీచ్

Image Source:

తూర్పు గోదవారి లోని ఉప్పాడ బీచ్ కాకినాడ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారాంతాల్లో ఇక్కడ గడపడానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ బసచేయడానికి కూడా అనేక సదుపాయాలు ఉన్నాయి

11.కళింగపట్నం బీచ్

11.కళింగపట్నం బీచ్

Image Source:

భారత దేశంలోని పురాతన రేవుపట్టణాల్లో శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం బీచ్ కూడా ఒకటి. గతంలో ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. బీచ్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ కు ఈ బీచ్ చాలా అనుకూలం. వంశధారా నది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రదేశం చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది.

12. భావనపాడు బీచ్

12. భావనపాడు బీచ్

Image Source:

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావన పాడు బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్ర తీరంలోని జీడిచెట్లు, మామిడి చెట్లు కనువిందు చేస్తాయి. టెక్కలి నుంచి ఉదయం, సాయంత్రం మాత్రమే బస్ సౌకర్యం ఉంటుంది. టెక్కలి లేదా పలాస నుంచి అల్తాడ చేరుకొని అక్కడి నుంచి ఆటోల్లో భావనపాడు బీచ్ ను చేరుకోవచ్చు.

13.కవిటీ బీచ్

13.కవిటీ బీచ్

Image Source:

శ్రీకాకుళానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవిటీ బీచ్ జీడిమామిడి, కొబ్బరి తోటలతో కనువిందుగా ఉండి కోనసీమను గుర్తుకు తెస్తుంది. ఈ గ్రామంలో చింతామణి అమ్మవారి ఆలయం, సీతారామస్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ సినిమాలు షూటింగ్ కూడా జరుపుకొంటాయి.

14. బారువ బీచ్

14. బారువ బీచ్

Image Source:

విశాలమైన ఇసుక తిన్నెలతో పర్యాటకులను ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. కార్తీక మాసలో సముద్రస్నానాలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ జనార్థనస్వామి, కోటి లింగేశ్వరస్వామి, జగన్నాథ స్వామి ఆలయాలు చాలా ప్రాముఖ్యం చెందినవి.

15. కృష్ణపట్నం బీచ్

15. కృష్ణపట్నం బీచ్

Image Source:

నెల్లూరు పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో అంత్యత పురాతనమైన బీచ్ ఉంటుంది. సహజ సిద్ధమైన పరిశుద్ధమైన వాతావరణ ఈ బీచ్ సొంతం. విశాలమైన ఇసుక తిన్నెలతో, పచ్చటి కొబ్బరి చెట్లతో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

16. మైపాడు బీచ్

16. మైపాడు బీచ్

Image Source:

మైపాడు బీచ్ నెల్లూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ పచ్చదనంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు చేపలు పట్టుకోవడానికి కూడా బీచ్ లో అవకాశం ఉంటుంది.

17. కోడూరు బీచ్

17. కోడూరు బీచ్

Image Source:

నెల్లూరు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఆటోలలో లేదా బస్సుల్లో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి కోడూరు బీచ్ కు సముద్రంలో బీటు షికారు ఒక మధురమైన అనుభూతి. ఇక్కడకు దగ్గర్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన వేళంగిని మాత చర్చ్ కూడా ఉంది.

18. తుపిలిపాలెం బీచ్

18. తుపిలిపాలెం బీచ్

Image Source:

తుపులిపాలెం బీచ్ బంగారు వర్ణంపు ఇసుక తిన్నెలతో చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి