Search
  • Follow NativePlanet
Share
» »రమణీయం ... పాలంపేట రామప్ప దేవాలయం !!

రమణీయం ... పాలంపేట రామప్ప దేవాలయం !!

రామప్ప దేవాలయం వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది.

By Mohammad

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.

రామప్ప దేవాలయం వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.

ఇది కూడా చదవండి : వేయిస్తంభాల గుడి, హన్మకొండ !!

ఆలయ చరిత్ర మరియు వర్ణన

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213 లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇటువంటి ఎన్నో విశేషాలు ఉన్న రామప్పదేవాలయం గురించి మరికొన్ని ప్రత్యేకతలు ...!!

పెద్ద శివలింగం

పెద్ద శివలింగం

ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది.

చిత్రకృప : SukuPhotography

మహా మంటపం

మహా మంటపం

మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు.

చిత్రకృప : SukuPhotography

శిల్ప సంపద

శిల్ప సంపద

ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.

చిత్రకృప : Srikanth Bandi

నంది ప్రత్యేకత

నంది ప్రత్యేకత

ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.

చిత్రకృప : Gokanag

శిల్పకళా చాతుర్యం

శిల్పకళా చాతుర్యం

రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణించనలవికానివి. ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించినట్లుగా, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.

చిత్రకృప : Adityamadhav83

శిల్పకళాకారుల్ని సైతం

శిల్పకళాకారుల్ని సైతం

రామప్ప గుడి లోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా అమర్చిన పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి.

చిత్రకృప : SukuPhotography

శిల్పకళ

శిల్పకళ

దేవాలయం లోని స్థంబాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యముల మరియు అనేక రకములైన వాద్యముల రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.

చిత్రకృప : Mrinalsrikanth

ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు

ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు

పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.

చిత్రకృప : Srikanth Bandi

రామప్ప దేవాలయం ఎలా చేరుకోవాలి ?

రామప్ప దేవాలయం ఎలా చేరుకోవాలి ?

రామప్ప దేవాలయం కు సమీపాన హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. చాలా మంది పర్యాటకులు హన్మకొండ లేదా వరంగల్ చేరుకొని, అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో పాలంపేట చేరుకుంటారు. హన్మకొండ నుండి ఎక్కవగా బస్సులు దొరుకుతాయి. పాలంపేట చేరుకున్నాక అక్కడి నుండి ఆటోలో రామప్ప దేవాలయం చేరుకోవచ్చు.

చిత్రకృప : Kiran.boddupally

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+