Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు లో వాలంటైన్ డే ఎక్కడ ?

బెంగుళూరు లో వాలంటైన్ డే ఎక్కడ ?

వాలంటైన్ డే వచ్చేసింది ! లవ్ లో పడ్డ యువతీ యువకులకు, జంటలకు , ఈ సారి ఎక్కడ జరుపుకోవాలి ? ఎలా ఆనందించాలి ? అనేవి మనసులో వచ్చే కొన్ని ప్రశ్నలు. కనుక అందుకు మార్గదర్శిగా మీ ప్రేమ మాయ జీవితం ఆనందించేందుకు మీరు కనుక బెంగుళూరు లో వుంటే కొన్ని ప్రదేశాలను పరిచయం చేస్తున్నాం, పరిశీలించండి.

 ప్రైవసీ అధికంగా కోరుకునే వారైతే !

ప్రైవసీ అధికంగా కోరుకునే వారైతే !

చాలామంది జంటలు అనేక మంది గుంపుగా ఆనందించే ప్రదేశంలో వారికి వారు ఆనందించలేరు. వీరికి ఒక ప్రత్యేక ప్రదేశం తక్కువ జనాలు ఉండేదిగా కావాలి. అటువంటి వారికి బెంగుళూరు సమీపంలోని యేలగిరి సరైన ప్రదేశం. సిటీ నుండి దూరంగా ఎటువంటి ధ్వనులు లేక ఆనందించ గల మంచి ప్రదేశం. బెంగుళూరు సిటీ నుండి యేలగిరి కి రెండు గంటల ప్రయాణంలో చేరవచ్చు.

 మీరు ఆహార ప్రియులా !

మీరు ఆహార ప్రియులా !

మీరు ఇరువురూ మంచి ఆహార ప్రియులు అయివుండి తింటూ, తాగుతూ ఒకరి కొకరు పరస్పరం ఆనందించు కొనే వారు అయితే ?
ఇట్టి వారికి ఎం జి రోడ్ లో లేదా బ్రిగేడ్ రోడ్ లోను కల రెస్టారెంట్ లలో పగలంతా ఆనందిన్చేయవచ్చు. ప్రేమ మహోత్సవ వేడుకలో మీ టేస్ట్ బడ్స్ ను త్రుప్తి పరుస్తూ ఆనందిన్చేయండి.

అలసట లేకుండా !

అలసట లేకుండా !

మీరు విశ్రాంతిగా అలసట లేకుండా ఆనందిన్చాలను కుంటున్నారా ? మీ వంటి వారికి డ్రైవ్ లేదా వాక్ కూడా చేయకుండా రోజంతా గడిపేందుకు బెంగుళూరు లో కొన్ని స్పా రిసార్ట్ లు కలవు.వీటిలో గడిపితే,సౌకర్యం మరియు మీరు ఆశించే ప్రేమ రెండూ దొరుకు తాయి.

 సాహసికులా!

సాహసికులా!

ప్రేయసీ ప్రియుడు ఇరూవురూ సాహసీకులు అయివుండి అడ్వెంచర్స్ చేయాలనుకునే వారా ? ఇట్టి వారికి బెంగుళూరు సమీపం లోని భీమేశ్వరి సరైన చక్కని రొమాంటిక్ ప్రదేశం. ఇక్కడ కల వైట్ వాటర్ రాఫ్టింగ్ , కొరకిల్ రైడ్ , ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఎన్నో ఆచరించవచ్చు.

 ప్రేమలో మరీ సున్నితమా !

ప్రేమలో మరీ సున్నితమా !

కొంతమంది దేనిని చూసినా త్రుప్తి చెంది ఆనందిన్చేస్తారు. ఒక పూవు లేదా, మంచి గాలి వంటివి వుంటే చాలు ఎంతో రొమాంటిక్ గా భావిన్చేస్తారు. ఇటువంటి వారికి బెంగుళూరు సమీపంలోని నంది హిల్స్ మంచి ప్రదేశం. ఇక్కడ మీరు ప్రకృతి దృశ్యాలు చూస్తూ మీ ప్రేయసి చేతిలో చేయి వేసి జీవిత కాలం ఆనందించవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+