Search
  • Follow NativePlanet
Share
» »పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం దర్శిస్తే మీ ప్రేమ ఫలిస్తుంది..!!

పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం దర్శిస్తే మీ ప్రేమ ఫలిస్తుంది..!!

పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం దర్శిస్తే మీ ప్రేమ ఫలిస్తుంది..!!

దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500దేవాలయకు మించి ఉండటం విశేషం. అయితే ఎన్ని దేవాలయాలున్నా..ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటే...మరికొన్ని కోరికలను నెరవేర్చేవిగా ఉన్నాయి. అయితే కుంభకోణాలనికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది.

ఈ దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగకారంలో ఉంటారు. ఈ శివలింగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈ దేవాలయం మాత్రం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. మామూలుగా శైవక్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాలకే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శక్తివనేశ్వర ఆలయానికి మాత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఎందుకు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తే..దానికి కారణాలున్నాయి.

ప్రేమవిషయానికొస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్లి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకొనుట సహజం. ప్రేమికులు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ధార్మికత ఆవరిస్తుంది. అయితే ఇక్కడొక దేవాలయం వుంది. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించేవారితోనే, మనం ఇష్టపడే వారితోనే వివాహంభాగ్యాన్ని ప్రసాదిస్తాడంట.అయితే ఆ దేవాలయం ఎక్కడ వుంది?ఆ దేవాలయం మహత్యం ఏమిటి? అనే దానిని గురించి సంక్షిప్తంగా వ్యాసంలో తెలుసుకుందాం.

శక్తివనేశ్వర దేవాలయం

శక్తివనేశ్వర దేవాలయం

ఈ దేవాలయం యొక్క పేరు శక్తివనేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలోని మాహాశివుడు లింగాస్వరూపంలో వెలసియున్నాడు. ఈ మహిమాన్వితమైన దేవాలయానికి వేలకొలది భక్తులు సందర్శిస్తూవుంటారు. ఈ దేవాలయం జీవితాన్ని కరుణించే శక్తియుత దేవాలయం అని ప్రసిద్ధిపొందినది.

PC:youtube

భక్తి, శ్రద్ధలతో వచ్చే భక్తుల కోరికలు సిద్ధిస్తాయి

భక్తి, శ్రద్ధలతో వచ్చే భక్తుల కోరికలు సిద్ధిస్తాయి

ఇక్కడి వచ్చే భక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యంగా చేయవలసినది శివుని అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధించటం. ఈవిధంగా ప్రార్థించిన వారికి మాత్రం తమ కోరికలు,ఇష్టాలు నెరవేరుతాయి అని అక్కడి భక్తుల నమ్మకం.

PC:youtube

ఈ దేవాలయం విశేషమేమంటే

ఈ దేవాలయం విశేషమేమంటే

ఈ దేవాలయం విశేషమేమంటే ఇక్కడి మహిమాన్వితమైన శివుడు తాము ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిని అందిస్తాడు. ఈ విధంగా ప్రేమించిన వారినే భాగస్వామిగా పొందిన ఎన్నో ఉదాహరణలు ఇక్కడున్నాయి. తాము అనుకున్నది జరుగుతుందని విశ్వాసం వల్ల అనేకమంది భక్తులు ఈ స్వామిని పూజించటానికి దేవాలయాన్ని సందర్శిస్తారు.

PC:youtube

ఈ దేవాలయ రహస్యం

ఈ దేవాలయ రహస్యం

ఇంతకీ ఈ దేవాలయం జీవితాన్ని కరుణించటానికి కారణం ఏమిటి? ఇక్కడ వున్న రహస్యం ఏమిటి? అనేటటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ వున్నాయి.అదేమిటో తెలుసుకుందాం.

PC:youtube

పార్వతి శివునిప్రేమలోనే తన్మయత్వంతో

పార్వతి శివునిప్రేమలోనే తన్మయత్వంతో

శివపార్వతులు పార్వతి పెరిగి పెద్దదవుతుంది.ఒక రోజు శివున్ని చూస్తుంది.అతనే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి గురించి ఆలోచిస్తూవుంటుంది.పార్వతి శివునిప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.

PC:youtube

తపస్సు

తపస్సు

శివుణ్ణి వరించటం మాటలలో చెప్పినంత సులభంకాదు. ఆ విధంగా పార్వతి శివుని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతి దేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడున్న దేవాలయంగా వెలసింది. ఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచుటకు కారణమైంది. క్రమంగా ...

PC:youtube

దృఢ సంకల్పం

దృఢ సంకల్పం

క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు ప్రసన్నుడౌతాడు.

PC:youtube

అగ్ని రూపంలో దర్శనం

అగ్ని రూపంలో దర్శనం

ప్రసన్నమైనాకూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీ దేవి మాత్రం కదలకుండా అలాగే వుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు.శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది.

PC:youtube

వివాహం

వివాహం

పార్వతీ ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిదేవిని వివాహంచేసుకుంటాడు.ఈ విధంగా ఆది శక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది. అదే విధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ, భక్తితో శివుని ఆరాధించినవారికి వారు ఇష్టపడి ప్రేమించినవారిని ప్రసాదిస్తారు.

PC:youtube

శివలింగం ఏ విధంగా వుంది

శివలింగం ఏ విధంగా వుంది

ఇక్కడి శివలింగం కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది.అంటే ఇక్కడున్న శివ లింగం పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ దేవాలయం ఎంతో మహత్యాన్ని కలిగియున్నది అని చెప్పవచ్చును.

PC:youtube

ఈ మహిమాన్విత దేవాలయం ఎక్కడ వుంది?

ఈ మహిమాన్విత దేవాలయం ఎక్కడ వుంది?

ఇంతకీ ఈ దేవాలయం వుండేది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయముండేది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుజిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7కిమీ ల దూరంలో వున్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో. దేవాలయం పేరు శక్తివనేశ్వర దేవాలయం.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ దేవాలయానికి సమీపంలో వున్న రైల్వేస్టేషన్ ఏదంటే అది తమిళ నాడు రాష్ట్రంలోని కుంభకోణం రైల్వేస్టేషన్. ఈ దేవాలయానికి సమీప విమానాశ్రయం ఏదంటే అది తంజావూరు విమానాశ్రయం.

PC:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+