Search
  • Follow NativePlanet
Share
» » గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా..

గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా..

గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా..

భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో 'సోమారామం' ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు గోదావరి జిల్లా ... భీమవరం సమీపంలోని 'గుణిపూడి' గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది. భక్త సులభుడైన శివయ్య ఇక్కడ 'సోమేశ్వరస్వామి' పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు.

ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి ... అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. మరి ఇలా మారడనికి అసలు రహస్యం ఏంటి, ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

పంచరమాలలో రెండవదైన సోమారామము

పంచరమాలలో రెండవదైన సోమారామము

పంచరమాలలో రెండవదైన సోమారామము రాజమండ్రి కి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గునిపూడి లో కలదు.

Photo Courtesy: MustSee IndianTemples

ఇక్కడ స్వామి వారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు

ఇక్కడ స్వామి వారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు

ఇక్కడ స్వామి వారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. చంద్రుడికి సోముడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామం అని సోమేశ్వర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు.

P.C: You Tube

ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే

ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే

ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే, మామూలు రోజుల్లో తెలుపు రంగు లో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది.ఇది శతాబ్దకాలంగా జరుగుతోందిని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

P.C: You Tube

పురాణ కథ

పురాణ కథ

ఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడి తరలి వస్తుంటారు. ఇక్కడ గల స్వామి వారిని చంద్రుడు ప్రతిష్టించినాడని ప్రతిథి. ఇక ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది.

Photo Courtesy: PV Bhaskar

ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది.

ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది.

ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు.

P.C: You Tube

ఇక్కడి అమ్మవారు 'అన్నపూర్ణ'గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

ఇక్కడి అమ్మవారు 'అన్నపూర్ణ'గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

ఇక్కడి అమ్మవారు 'అన్నపూర్ణ'గా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

P.C: You Tube

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటు పై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది.

 పంచ నందీశ్వర ఆలయం

పంచ నందీశ్వర ఆలయం

అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు. ఇదిలా ఉండగా ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభం పై ఉన్న నందీశ్వరుడి నుంచి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తుంది.

P.C: You Tube

శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

మూల విరాట్టు కింది అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. మొత్తం రెండు అంతస్తుల ఉన్న దేవాలయంలో మూలవిరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు.

P.C: You Tube

ఈ క్షేత్రంలోని 'చంద్ర పుష్కరిణి' లో స్నానం చేస్తే

ఈ క్షేత్రంలోని 'చంద్ర పుష్కరిణి' లో స్నానం చేస్తే

ఈ క్షేత్రంలోని 'చంద్ర పుష్కరిణి' లో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ వుంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను ...గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి.అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.

P.C: You Tube

ప్రతి ఏడాది ఇక్కడ 'మహా శివరాత్రి' సందర్భంగా

ప్రతి ఏడాది ఇక్కడ 'మహా శివరాత్రి' సందర్భంగా

ప్రతి ఏడాది ఇక్కడ 'మహా శివరాత్రి' సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలాగే 'దేవీనవరాత్రులు' కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ వుంటుంది. ఈ పర్వదినాల్లో ఆదిదంపతులను దర్శించడంవలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

P.C: You Tube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?


సోమారామంకు రోడ్ మరియు రైలు మార్గాలు అన్ని ప్రధాన నగరాల నుండి అనుసందానింపబడినది . విజయవాడ మరియు ఏలూరు నుండి భీమవరానికి చాలా ప్రత్యక్ష బస్సులు ఉన్నాయి. గుణిపుడి గతంలో చిన్న గ్రామం, కానీ ఇప్పుడు భీమవరంలో భాగం. భీమవరం చేరుకున్న తరువాత గునిపూడికి ఆటోలో వెళ్ళవచ్చు.

కార్తీక మస్సంలో ఒకే రోజులో పంచరామాలను సందర్శించడానికి టూర్ ప్యాకేజ్ ను APSRTC ప్రత్యేకంగా నిర్వహిస్తుంది.

భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లో లేదు. చాలా ఎక్స్ప్రెస్లు ఈ స్టేషన్ ద్వారా వెళ్ళవు. విజయవాడ లేదా ఏలూరు వద్ద దిగి అక్కడి నుండి ఆటో , బస్సులలో ప్రయాణించాల్సి ఉంటుంది.

గుణిపుడికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు విజయవాడ / రాజమండ్రి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+