మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి.
భీమశంకర్ పూనే నగరానికి దగ్గరగా ఖేడ్ పట్టణానికి వాయువ్యంగా సుమారు 568 కి.మీ.ల దూరంలో షిరాధోన్ గ్రామంలో 3250 అడుగుల ఎత్తున కలదు. ఈ దేవాలయం సహ్యాద్రి కొండల శ్రేణి ప్రాంతంలో కలదు. భీమశంకర్ భీమానది పుట్టిన ప్రాంతం. ఈ నది ఆగ్నేయ దిశగా ప్రవహించి క్రిష్ణా నదిలో కలసిపోతుంది.
మతపర ప్రదేశం - ఇతిహాసం మేరకు శివ భగవానుడు సహ్యాద్రి కొండలలో భీముడి అవతారంగా దేవతల కోరిక మేరకు నివసిస్తున్నాడని చెపుతారు. త్రిపురాసురుడనే రాక్షసుడితో శివుడు పోరాడి ఆ రాక్షసుడిని వధించాడు. ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడి శరీరంనుండి ప్రవహించిన చెమట ధారలే భీమ నదిగా ప్రవహించాయని చెపుతారు.
ఈ ప్రాంతంలో మరి కొన్ని దేవాలయాలు కూడా కలవు. కమలాజ - పార్వతీ దేవి అవతారం. మోక్షకుండ తీర్ధ - ఇది భీమ శంకర్ దేవాలయ వెనుక భాగంలో కలదు. కుషారణ్య తీర్ధ మరియు సర్వతీర్ధ ఇతర మతపర ప్రదేశాలు. వీటిని తప్పక చూడాలి.
భీమశంకర్ ప్రదేశం తీర్ధ యాత్రికులకు మాత్రమే స్వర్గంగా ఉండదు. ఇది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వర్గం లానే ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో ట్రెక్కింగ్ అవకాశాలు కలవు. ఈ ప్రాంతం అంతా సహ్యాద్రి కొండల కిందకు వస్తుంది. ఎన్నో రకాల పక్షులు ఇక్కడి రిజర్వు అటవీ ప్రదేశంలో ఉంటాయి. వివిధ రకాల వన్య జీవులు కూడా ఈ ప్రదేశంలో సంరక్షించబడుతున్నాయి. గ్రేట్ ఇండియన్ స్వ్విర్రల్ లేదా ఉడుత తప్పక చూడదగిన జంతువులలో ఒకటి. భీమశంకర్ ప్రదేశం మతపర అభిమానులకే కాదు సాహస క్రీడా కారులకు కూడా ఖ్యాతిగాంచిన ప్రదేశం. పచ్చటి ప్రదేశాలను ప్రదర్శిస్తూ పర్యాటకుల మనసులను దోచుకునే ప్రదేశంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications