Search
  • Follow NativePlanet
Share
» »ఫైవ్ స్టార్ హోట‌ల్‌ని త‌ల‌పించే ల‌గ్జ‌రీ ట్రైన్ మ‌న ఇండియాలోనే..

ఫైవ్ స్టార్ హోట‌ల్‌ని త‌ల‌పించే ల‌గ్జ‌రీ ట్రైన్ మ‌న ఇండియాలోనే..

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ సౌకర్యాలకు పేరుగాంచిన అనేక ఫైవ్ స్టార్ హోట‌ల్స్‌ను మీరు చూసి ఉంటారు. భార‌త్‌లో ఇలాంటివి ఒక్క‌టి మాత్ర‌మే కాదు. చాలానే ఉన్నాయి. ఫైవ్‌ స్టార్, సెవెన్ స్టార్ హోట‌ల్స్ అనేకం ఉన్నాయి. కానీ, క‌దులుతున్న ల‌గ్జ‌రీ హోట‌ల్‌ను ఎప్ప‌డైనా చూశారా? అందులో ఎప్పుడైనా ప్ర‌యాణించారా? అయితే ఇది మాత్రం త‌ప్ప‌కుండా చ‌ద‌వాల్సిందే.

భార‌త్‌లో ఎక్కువ‌మంది ప్ర‌యాణికులు రైలు మార్గాల‌నే ఎంచుకుంటారు.ఎందుకంటే, ఈ ప్ర‌యాణం సౌక‌ర్య‌వంతంగానూ అతి త‌క్కువ ధ‌ర‌తో త‌మ గ‌మ్య‌స్థానాల‌ను చేర్చ‌డంలో ముందువ‌రుస‌లో ఉంటుంది. అందుకే చాలామంది రైలు ప్ర‌యాణాల‌పై ఎక్కువ ఆస్త‌కి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక‌, ప్ర‌స్తుతం భార‌త్‌లో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో కూడిన రైలు స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చాయి. వందేభార‌త్ వంటి ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పుడు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక‌, దేశంలోనే అత్యంత ల‌గ్జ‌రీ ట్రైన్‌, ఫైవ్ స్టార్ ట్రైన్‌ను ఎప్పుడైనా ఎక్కారా..? ఈ ట్రైన్ గురించిన విశేషాలు తెలుసుకుందాం ప‌దండి.

sleepervandebharatexpresstrain

సెమీ-హై స్పీడ్ రైలు ...

దేశంలోనే మొట్టమొదటి సుదూర లగ్జరీ రైలు ట్రాక్ ప‌ట్టాల‌పై ప్ర‌యాణించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దీని వేగం చిరుత‌పులి కంటే ఎక్కువ‌గా ఉంటుంది. దీని వేగం గంట‌కు 130 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ రైలు ట్రాక్‌పై దిగే సమయం దాదాపుగా ఖ‌రారైన‌ట్లు స‌మ‌చారం.

రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వేల్లో నిరంతరం మార్పులు జరుగుతున్నాయి, సెమీ-హై స్పీడ్ రైలు అంటే వందే భారత్ నుండి సామాన్య ప్రజల కోసం ప్రారంభించబడిన అమృత్ భారత్ రైలు వరకు అధునాత‌న‌మైన సౌక‌ర్యాలు ఇప్ప‌డు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇప్పుడు మరో సుదూర లగ్జరీ రైలు అంటే స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ట్రాక్‌పై నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ట్రైన్ కూడా వంద‌రోజుల ప్రణాళికలో చేర్చబడింది. ఈ లగ్జ‌రీ ట్రైన్ సెప్టెంబరులో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ రైలుతో ప్రజలు చాలా సౌకర్యవంత‌మైన జీవితాన్ని గ‌డ‌పొచ్చు.

sleepervandebharatexpresstrain1

స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు...

స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రాజధాని తరహాలో ఇందులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉండ‌నున్నాయి. బెర్త్‌లు, ఎయిర్ డక్ట్‌లు, కేబుల్ డక్ట్‌లు మరియు వాష్‌రూమ్‌ల డిజైన్‌లు కూడా రాజధానిలో ఉన్న వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఈ రైలు గరిష్ట వేగం గంట‌కు 160 కిలోమీట‌ర్లు ఉంటుంది. తద్వారా ఎక్కువ దూరాలను తక్కువ సమయంలో కవర్ చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

మొదటి ఏసీ కోచ్‌లలో ఈ సౌకర్యాలు ఉంటాయి

వందేభారత్‌లో చైర్‌కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ మధ్య వ్యత్యాసం ఉన్నట్లే, థర్డ్ మరియు సెకండ్ ఏసీలతో పోలిస్తే ఫస్ట్ ఏసీలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇందులోని బెర్త్‌లు మరింత సౌకర్యవంతంగా అంటే ప్యాడెడ్‌గా ఉంటాయి. ప్రయాణికులకు విమాన సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా, ఇతర వర్గాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైన పద్ధతిలో ఆహారం మరియు పానీయాలు కూడా ఇక్క‌డ అందించబడతాయి. ఈ కోచ్‌లలో అటెండర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. ప్ర‌యాణికులు సౌక‌ర్యార్థం వారు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+