Search
  • Follow NativePlanet
Share
» »మాన్‌సూన్ వెడ్డింగ్‌కు భార‌తదేశంలోని ఉత్త‌మ‌మైన‌ నగరాలు ఇవే..!

మాన్‌సూన్ వెడ్డింగ్‌కు భార‌తదేశంలోని ఉత్త‌మ‌మైన‌ నగరాలు ఇవే..!

మాన్‌సూన్ వెడ్డింగ్‌కు భార‌తదేశంలోని ఉత్త‌మ‌మైన‌ నగరాలు ఇవే..!

వివాహం అనేది భారతదేశంలో గొప్ప వైభవంగా జరుపుకునే ఒక పండుగ. ప్ర‌స్తుతం ఒక్కో ఫంక్షన్‌కి విడివిడిగా సన్నాహాలు చేస్తున్నారు. పసుపు, మెహందీ, రిసెప్షన్ కోసం ఖరీదైన రిసార్ట్‌లు మరియు హోటళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. కాబట్టి వర్షాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తుంటే మాత్రం భారతదేశంలో కొన్ని అంద‌మైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వ‌ర్ష‌కాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ఇంకా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశాలను పెళ్లికి వ‌చ్చే అతిథులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

1

కోవలం

కేరళలో చాలా అందమైన ప్రదేశం కోవ‌లం. ఇది వర్షాకాల వివాహానికి సరైనది. కోవలంలో అనేక రిసార్ట్‌లు, హోటళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు ఎంతో అనువైన‌ది. ఈ ప్రాంత‌పు అందాలు, అక్క‌డి మ‌నోహ‌ర‌మైన దృశ్యాలు వివాహ వేడుకను మరపురానిదిగా చేస్తాయి. ఇక్క‌డి హౌస్‌బోట్‌లో వెడ్డింగ్ ఫంక్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. కాబోయే కొత్త‌జంట‌ల‌కు ఇదో మ‌ర‌పురాని అనుభూతిని మిగులుస్తుంది.

2

ఉదయపూర్

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు 'సిటీ ఆఫ్ లేక్స్' గా పేరుంది. ఈ చారిత్రక ప్రదేశం అందమైన కట్టడాలకు, అద్భుతమైన సరస్సులకు నెలవు. చుట్టూ అందమైన సరస్సులు, అద్భుతమైన కోటలతో ఈ ప్రాంతం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఒకప్పుడు మెవార్ రాజవంశస్థులు పాలించిన ఈ ప్రాంతం ఇప్పుడు రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. వెడ్డింగ్ డెస్టినేష‌న్‌కు అనువైన ప్రాంతం ఇది. ఎన్నో బాలీవుడ్ సినిమాల చిత్రీక‌ర‌ణ ఇక్క‌డే జ‌రిగింది. ఎంతో మంది సెల్ర‌బీటులు కూడా ఈ ప్రాంతంలో ఒక్క‌ట‌యిన సంద‌ర్భాలు ఉన్నాయి.

3

గోవా

దేశ, విదేశీ టూరిస్టుల తాకిడితో ఎప్పుడూ కోలాహలంగా ఉండే నగరం 'గోవా'. ఇక్కడి బీచ్ ల గురించి, టూరిస్ట్ ప్రదేశాల గురించి చెప్పుకోని వారు ఉండరు. గోవా వినోదం, పార్టీ అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. కాబట్టి వివాహ వేడుకను ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. గోవాలో బీచ్ సైడ్ వెడ్డింగ్ చాలా ఫేమస్. గోవాలోని నైట్ స్టేయింగ్ వివాహ వేడుకను అద్భుతంగా మారుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. విభిన్న సంస్కృతులు, జాతీయతలు కలగసిన గోవా ఎంతో ప్రత్యేకతతో నిండి ఉంటుంది. గోవాలో అడుగు పెట్టిన వారు తిరిగి వెళ్లేందుకు అంత తొందరగా ఇష్టపడరు.

లోనావాలా

లోనావాలా అనేది ప‌శ్చిమ భార‌త‌దేశంలోని ప‌చ్చ‌ని లోయ‌ల‌తో కూడిన ఒక హిల్‌స్టేష‌న్‌. దీనిని గుహ‌ల న‌గ‌రం అని కూడా పిలుస్తారు. ద‌ట్ట‌మైన అడవులు, జ‌ల‌పాతాలు, స‌ర‌స్సుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఆన‌క‌ట్ట‌ల‌తో చుట్టుముట్ట‌బ‌డిన ఈ ప్రాంతం ప్ర‌కృతి ఆరాధికులు త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశం. వర్షాకాలంలో సందర్శించడానికి సరైన గమ్యస్థానాలలో ఇది ఒకటి. వెడ్డింగ్ డెస్టినేష‌న్‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. వర్షాకాలంలో ఈ ప్రాంతపు అందాలు రెట్టింప‌వుతాయి. ఈ సీజ‌న్‌లో ఈ ప్రాంతాన్నిసందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు. ఈ ప్రాంతం హార్డ్ స్వీట్స్ చిక్కికి ప్రసిద్ధి చెందింది. వ‌ర్షాకాలంలో ఇక్క‌డి ప‌చ్చ‌ద‌నం సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కులు రిఫ్రెష్ అవ్వొచ్చు.లోనావాల ప్ర‌తి సీజ‌న్‌లో విభిన్న ఆక‌ర్ష‌ణ‌ల‌ను క‌లిగి ఉంటుంది.

More News

    Read more about: kovalam udaipur goa
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+