Search
  • Follow NativePlanet
Share
» »మ‌న దేశంలో బైక్ రైడ‌ర్లకు ఇష్ట‌మైన మార్గాలు ఇవే..!

మ‌న దేశంలో బైక్ రైడ‌ర్లకు ఇష్ట‌మైన మార్గాలు ఇవే..!

వాతావ‌ర‌ణం మారుతూ వ‌స్తోంది. ఔత్సాహిక ప‌ర్యాట‌కుల‌కు ఈ సీజ‌న్ ఎంతో అనువైన‌దిగా చెప్పొచ్చు. మ‌రీ ముఖ్యంగా బైక్ రైడ్ చేస్తూ.. సుదూర ప్రాంతాల అంచుల‌ను తాకాల‌నే ఉత్సాహం ఉన్న రైడ‌ర్లు ఈ సీజ‌న్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే, ఈ వాతావ‌ర‌ణం మ‌న‌సుకు తెలియ‌ని ఎన్నో అనుభూతుల‌ను చేరువ చేస్తూ ఉంటుంది.

Bike riding places

మ‌రి మ‌న దేశంలో ఇలా బైక్ రైడ్ చేసేందుకు అనువైన మార్గాలేంటో మీకు తెలుసా? నిజానికి, ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ.. పురాత‌న నిర్మాణాల‌ను క‌నులారా చూస్తూ ముందుకు సాగేందుకు మ‌న దేశంలో చాలా ప్ర‌దేశాలు ఉన్నాయి. బైక్ రైడ్ ద్వారా అక్క‌డికి చేరుకునేందుకు ఎంతో అనువుగా ఉంటాయి. మ‌రెందుకు ఆల‌స్యం.. కొన్ని ప్ర‌ముఖ‌మైన బైక్ రైడ్ మార్గాలను చూసేందుకు మీరూ సిద్ధ‌మ‌వ్వండి!

ఇటీవ‌ల కాలంలో యువత బైక్ రైడింగ్‌పై ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్న విష‌యం కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క సారి బైక్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. మేఘాల‌లో తేలిపోతూ జ‌ర్నీని సాగిస్తున్నారు. అయితే, అలా సూదూర ప్రాంతాల‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌సరిగా కొన్నిగా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. మ‌నం ఎంపిక చేసుకునే మార్గాల‌లో కొన్ని ప్ర‌మాద‌క‌రమైన‌వి కూడా ఉండొచ్చు. అందుకే, రైడ్‌కు వెళ్లే ముందు ఒక ప్ర‌ణాళిక అవ‌సరం.

Bike riding places

మ‌రీ ముఖ్యంగా, ఎంపిక చేసుకున్న మార్గాల‌లో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి. మ‌లుపులు ఉన్న ఘాట్ రోడ్ల‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేంటి? ఇలా చాలా స‌మాచారాన్ని ముందుగానే సేక‌రించుకోవ‌డం మంచిది. అలా ముందుకు సాగే ప్ర‌యాణంలో ఈ మార్గాలు బైక్ రైడ్‌లో మీకు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభాల‌ను అందిస్తాయి.

బెంగళూరు టూ ఊటీ మార్గం..

ప్రకృతి అందాలతో బెంగళూరు నుండి ఊటీ ప్రయాణం ఎంతో ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తుంది. సుమారుగా 278 కిలోమీట‌ర్ల మేర రామనగర, మైసూర్ వంటి నగరాల మీదుగా ఈ రైడ్‌లో ప్ర‌యాణం చేయొచ్చు. ఈ మార్గం గుండా గ‌మ్య‌స్థానాన్ని చేరుకునేందుకు ఓ బైక్ రైడ‌ర్‌కు సుమారు ఆరు నుంచి ఏడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ లాంగ్ డ్రైవ్‌లో చారిత్ర‌క విశేషాల‌ను ప‌ల‌క‌రించాలి అనుకుంటే మాత్రం సిటీలోని మైసూర్ ప్యాలెస్‌లో అడుగుపెట్ట‌డం అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు. అలాగే, ఊటీలోని ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించేందుకు నీలగిరి ఘాట్‌లు, ఊటీ టీ గార్డెన్ వంటి ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను త‌ప్ప‌కుండా చూడాల్సిందే.

జైపూర్ నుండి జైసల్మేర్

అద్భుతమైన కట్టడాలకు, పురాత‌న‌ కోటలకు నిల‌యమైన రాజస్థాన్ ఈ సిజ‌న్‌లో ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా క‌నిపిస్తుంది. చాలా వ‌ర‌కూ ఇక్క‌డి ప్రాంతం ఎడారితో ఉండ‌డం వ‌ల్ల బైక్ రైడ‌ర్ ఈ మార్గాల‌ను ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. జైపూర్-జోధ్‌పూర్-జైసల్మేర్ మార్గం గుండా సాగే బైక్ రైడ్ గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈ మార్గంలో సుమారు 500 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ బైక్ రైడ్‌లో అక్కడి అందాల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక్కడి చారిత్ర‌క ప్రాంతాల‌న్నంటిని బైక్ రైడ్‌తో క‌వ‌ర్ చేయాలంటే ప‌ది నుంచి ప‌ద‌కొండు గంట‌ల వ‌ర‌కూ స‌మ‌యం పట్టే అవ‌కాశం ఉంది.

ఢిల్లీ నుండి ఆగ్రా

కొత్త అనుభూతుల‌ను పొందాలంటే ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు బైక్ రైడ్ స‌రైన ఎంపిక‌నే చెప్పాలి. విస్తార‌మైన ర‌హ‌దారిపై సాగే ఈ ప్ర‌యాణం మ‌న‌సుకు ఎంతో ప్ర‌శాంత‌త‌ను అందిస్తుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బైక్ రైడ్ చేయ‌డం ద్వారా ఇక్క‌డ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా హాయిగా ముందుకు సాగిపోవ‌చ్చు. ఇక్క‌డ‌ నోయిడా నుండి యమునా ఎక్స్‌ప్రెస్ వే మొద‌ల‌వుతుంది. అక్క‌డి నుండి తాజ్ మహల్ చేరుకునేందుకు సుమారు 238 కిలోమీటర్ల దూరం బైక్ రైడ్ చేయాలి.

More News

    Read more about: ladakh jaisalmer
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+