Search
  • Follow NativePlanet
Share
» »ఇవి భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాలు..

ఇవి భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాలు..

ఇవి భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాలు..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాలు చాలానే ఉన్నాయి. అక్కడకు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇండియాలో కూడా అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాలు ఉన్నాయి. మెర్సర్ సర్వే 2023 నివేదికలో భారతదేశంలో నివసించే అత్యంత ఖరీదైన నగరంలో ముందు వ‌రుస‌లో ముంబై ఉంది. ఈ నగరం సర్వే నివేదికలో 147వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (169), చెన్నై (184), బెంగళూరు (ర్యాంక్ 189), హైదరాబాద్ (ర్యాంక్ 202), కోల్‌కతా (ర్యాంక్ 211) పూణే (ర్యాంక్ 213) వంటివి జాబితాలో ఉన్నాయి. సుమారు 200 అంశాలను ఈ సర్వేలో పోల్చింది. ఆసియాలోని టాప్ 35 ఖరీదైన నగరాల్లో ముంబై, ఢిల్లీ పేర్లు ఉన్నాయి. ఈ నగరాల గురించి కాస్త వివ‌రంగా తెలుసుకుందాం.

ముంబై నగరం

భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైని కలల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి ప్రజలు తమ కలలను నెరవేర్చుకోవడానికి వస్తారు. ముంబయి గతంలో బొంబాయిగా పిలువబడేది. సంస్కృతులు, జీవనశైలిల‌ అందమైన మిశ్రమం ఈ న‌గ‌రం సొంతం. సూపర్‌స్టార్ల నుండి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు, మత్స్యకారుల తెగలు, మురికివాడల వరకు, ముంబై అన్ని రకాల ప్రజలకు నిలయంగా ఉంది. కానీ ఇక్కడ ప్రజలు నివసించడం చాలా కష్టమ‌నే చెప్పుకోవాలి. ఒక గది ఖర్చు కూడా ఇక్కడి ప్రజల బడ్జెట్‌ను దాటి వెళుతుంది.

1

ఢిల్లీ

భారతదేశ రాజధాని ఢిల్లీ చారిత్రాత్మకమైన పాత ఢిల్లీ, ఆధునిక న్యూఢిల్లీలతో కూడిన ఒక కాస్మోపాలిటన్ నగరం. చారిత్రాత్మక స్మారక చిహ్నాల నుండి సందడిగా ఉన్న షాపింగ్ మాల్స్ వరకు, అధునాతన మెట్రో వ్యవస్థ, విశాలమైన నెట్‌వర్క్ నుండి ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ వరకు అనేక అంశాలు ఇక్క‌డ ఉన్నాయి. పాత ఢిల్లీలోని ఇరుకైన, వంకరగా ఉండే దారులు మొఘల్ పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ ఢిల్లీలో నివ‌సించ‌డం కూడా క‌ష్టమే. ఎందుకంటే, ఇక్క‌డ ప్ర‌తిదీ అత్యంత ఖ‌రీదైన‌విగా ఉంటాయి.

2

బెంగళూరు నగరం

గార్డెన్ సిటీ నుండి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా వరకు, బెంగళూరు క్రమంగా భారతదేశంలో మూడవ అతిపెద్ద నగరంగా మారింది. బెంగుళూరు దాని ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ఉద్యానవనాలు, అనేక సరస్సులకు ప్ర‌సిద్ధి చెందింది. బెంగుళూరు రెస్టారెంట్ స్ట్రీట్ ఫుడ్ కార్నర్‌లు, ప్రత్యేకమైన కేఫ్‌లు, కాఫీ రోస్టర్‌లు, పబ్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది. బ్రంచ్, బఫెట్, టెర్రేస్ కేఫ్, ఇవన్నీ బెంగళూరులో కనిపిస్తాయి. అయితే ఇక్కడ నివసించడం కూడా క‌ష్ట‌మే అని అంటున్నాయి స‌ర్వేలు..

3

చెన్నై సిటీ

ఒకప్పుడు మద్రాస్ అని పిలువబడే చెన్నై, భారతదేశపు దక్షిణ భాగంలో ఉన్న తమిళనాడు రాష్ట్రానికి రాజధాని. బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరంలో ఉంది చెన్నై.ఈ నగరం సాంస్కృతిక చరిత్రను కలిగి ఉంది. చెన్నై దాని దేవాలయాలు, బ్రిటీష్ కాలం నాటి మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, పాక డిలైట్స్, మెరీనా బీచ్ వంటి ప్ర‌దేశాలు దక్షిణ-భారత సంస్కృతికి ప్రసిద్ధి చెందాయి. చెన్నై నగరం సందర్శించేందుకు ఖ‌రీదైన‌దే, నివసించేందుకు కూడా ఖరీదైనదే.

3

పూణే సిటీ

మహారాష్ట్రలోని పూణె జీవనశైలి పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దీనిని తరచుగా ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. పూణే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓషో ఆశ్రమానికి ప్రసిద్ధి చెందింది. రాజభవనాలు, దేవాలయాలు ఇక్క‌డ అధికంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి శనివార్ వాడా ప్యాలెస్, అగాఖాన్ ప్యాలెస్. పూణే జీవన పరంగా కూడా చాలా ఖరీదైనదనే చెబుతారు.

More News

    Read more about: mumbai city delhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+