ప్రశాంతతకు మారుపేరు ఈ జాతీయ ఉద్యానవనాలు..
వేసవిలో విశ్రాంతి తీసుకునేందుకు కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడిపేందుకు జాతీయ ఉద్యానవనాలు ఎంతో ఉత్తమం. జంతు ప్రేమికులకు ఈ ప్రదేశాలు ఎంతగానో నచ్చుతాయి. మీరు కూడా సెలవుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తుంటే, తప్పకుండా ఈ ప్రాంతాలను సందర్శించాల్సిందే. మన దేశంలో సందర్శించడానికి ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలు చాలానే ఉన్నాయి.
వేసవి కాలంలో అయితే చాలామంది పర్వతం, సముద్రం లేదా ఉద్యానవనంలో విశ్రాంతి క్షణాలను గడపడానికి మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి చల్లని ప్రదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి వారికోసమే దేశంలోని ఈ ప్రసిద్ధ పార్క్‌ల గురించి వివరిస్తున్నాము. ఈ ప్రాంతంలో మీరు సెలవులను సంతోషంగా గడపొచ్చు.

కుద్రేముఖ్ నేషనల్ పార్క్, కర్ణాటక
చుట్టూ పచ్చదనం మరియు అద్భుతమైన కొండలు ప్రశాంతతకు మారుపేరు కుద్రేముఖ్ నేషనల్ పార్క్ సొంతం. ఈ ప్రాంతం సంవత్సరమంతా సందర్శించేందుకు ఉత్తమమైన ప్రదేశం. కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ప్రకృతి స్వర్గధామం. ముఖ్యంగా ట్రెక్కింగ్ ప్రియులకు ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇది రోలింగ్ కొండల గుండా వెళ్లే అనేక ట్రాక్‌లను కలిగి ఉంది. సాహసప్రియులకు కూడా ఈ ప్రదేశం ఎంతో ఉత్తమం. ఈ ప్రాంతంలో ఉన్న అందమైన జలపాతాలను ఇక్కడికి వచ్చే చూపరులను ఆకట్టుకుంటాయి.
పచ్చని కొండలు, చెట్లమధ్య రాళ్లపై నుండి ప్రవహించే నీరు పర్యాటకులు అనుభవానికి మరింత ఆనందాన్నిజోడిస్తాయి. ఇక్కడ సాంబార్, బైసన్ వంటి జంతువులు కనిపిస్తాయి. ఈ పార్క్‌లో 200 రకాల పక్షులు కూడా ఉన్నాయి. మరెన్నో రకాల జంతుజాలం ఇక్కడ ఉన్నాయి. వన్యప్రాణులు, జలపాతాలతో పాటు జాతీయ ఉద్యానవనం గొప్ప టీ కాఫీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది.

నోక్రెక్ నేషనల్ పార్క్, మేఘాలయ
నోక్రెక్ నేషనల్ పార్క్ దాని ప్రత్యేక లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని సహజ సౌందర్యం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తుంది. పచ్చని పొడవాటి చెట్ల మధ్య రెడ్ పాండా నివాసం కూడా ఉంది. ఈ పార్కులో అడవి పిల్లుల దృశ్యం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మే నుండి అక్టోబరు నెలలలో ఇక్కడ సందర్శించడానికి ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఈ పార్క్‌లో ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలంతో కప్పబడి ఉంటుంది. సిమ్సాంగ్ రివర్‌గేమ్ రిజర్వ్, నోక్రెక్ పీక్, నార్బుగాంగ్ పార్క్ మరియు రోన్‌బాంగ్ డేర్ జలపాతాలు ఈ పార్క్‌లో ప్రత్యేక ఆకర్షణలు.
అంతేకాకుండా గారో హిల్స్‌లో అనేక సహజ సున్నపురాయి గుహలు కూడా ఉన్నాయి. వీటిలో సిజు గుహ ప్రసిద్ధిచెందింది. గుహ పొడవు మొత్తం నీటితో కప్పబడి ఉంటుంది. ఎర్రపాండాలు, ఆసియా ఏనుగు, లంగూర్, క్లౌడెడ్ చిరుతపులి, చిరుతపులి పిల్లి, గోల్డెన్ క్యాట్, పాంగోలిన్, అడవి దున్న, కొండచిలువ, ఏనుగు, సెరో మరియు టైగర్ వంటి జంతుజాతులు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అలాగే, అనేక పర్వత పాములు ఈ పార్కును తమ నివాసంగా మార్చుకున్నాయి.

నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్, కర్ణాటక
నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో కలదు. నాగరహోలే అనేపేరు నాగ నుండి వచ్చింది. అంటే పాము మరియు హోల్ అంటే ప్రవాహాలు అని అర్థం. ఈ పార్కును రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఈ పార్క్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ పార్కులలో ఒకటి. చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ పార్క్ పర్యాటకులను మైమరింపజేస్తుంది. కర్ణాటకను సందర్శించడానికి వెళితే మాత్రం తప్పకుండా ఈ పార్కును సందర్శించాల్సిందే. ఈ పార్క్ భారతదేశంలో ముప్పయి ఏడవ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించబడింది. ఇది యునెస్కోచో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
బందీపూర్, ముదుమలై వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనే మూడుపార్క్‌లు నాగర్‌హోల్ పక్కనే ఉన్నాయి. బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుతపులి, స్లాత్ బేర్, హైనాలో కనిపించే వేటాడే జంతువులు. ఏనుగులు, చితాల్, సాంబార్ జింకలు మరియు మొరిగే జింకలు వంటి శాకాహారులు కూడా ఈ జాతీయ ఉద్యానవనం చుట్టూ కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications















