Search
  • Follow NativePlanet
Share
» »భూలోకంలో దేవుడు గీసిన సుందర చిత్రం ... ' గుల్మార్గ్ ' !!

భూలోకంలో దేవుడు గీసిన సుందర చిత్రం ... ' గుల్మార్గ్ ' !!

కాశ్మీర్‌ పేరు చెప్పగానే అందమైన పచ్చదనం, ప్రకృతి సోయగం గుర్తుకు రావడం సహజం. సుందర కాశ్మీరం భారతీయులకే కాదు ప్రపంచ యాత్రికులకూ భూలోక స్వర్గమే. ఉద్యానవనాలు, సరస్సులు, పర్వతాలు, పచ్చిక బయళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే... గుల్మార్గ్ ప్రదేశం పర్యాటకులకు ఒక రిసార్ట్ వంటిది.. ఆ నేలంతా ఓ సుందర ఉద్యానవనే...ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచినది గుల్మార్గ్‌ ప్రాంతం.

ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదుగుతూ వరుసలో నిలబడి పచ్చని చెట్లతో... భగవంతుడు గీసిన సుందర ప్రకృతి చిత్రానికి నిదర్శనంగా నిలుస్తుంది గుల్మార్గ్‌.

గల్మార్గ్ లో హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పూల అందాలు

పూల అందాలు

గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. పూలరంగులలో, రూపాలలో మహాద్భుతం ఇక్కడ తాండవిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేరు. జహంగీర్‌ చక్రవర్తి తన బహు భార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్గ్‌కి వచ్చా డట. ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చేందుకు సేకరించగా, ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయాయట.‘గుల్‌' అంటే పువ్వులు, ‘మార్గ్‌' అంటే పచ్చిక బయళ్ళు. గుల్మార్గ్‌ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం.

Photo Courtesy: sandeepachetan.com

టీ

టీ

ఇక్కడ ‘టీ' చాలా ప్రసిద్ధి. ‘కహనా' అనే ఈ ‘టీ'లో బాదామ్‌, ఏలకులు, దాల్చినీ వేసి ‘బ్లాక్‌ టీ' తాగుతారు. ఇక్కడ అంతా మంచు వెనీలా ఐస్‌క్రీమ్‌ పరచినట్లు ఉంటుంది. మంచి నీళ్లు దొరకవు. మంచు వేడి చేసుకుని తాగాలి.

Photo Courtesy: kavitakapoor

స్కేటింగ్‌కు ప్రసిద్ధి

స్కేటింగ్‌కు ప్రసిద్ధి

గుల్మార్గ్‌కి మంచులో స్కేటింగ్‌ చేసేందుకు విదేశీ టూరిస్టులు వస్తారు. ఆ మంచులో కాళ్లు వేస్తే మోకాళ్ల వరకు, కూరుకుపోతూ కొంత నడిచి, గండోలాలో రోప్‌ వే పైన మంచు కొండల మీదకి వెళ్లవచ్చు. ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు, ఎంబ్రాయిడరీ, జరీపని, తివాచీలు తయారు చేస్తారు. ఫాస్మిలాన్‌ అనే దారం రాట్నం మీద వడుకుతారు. రంగుల దారాలు పెన్సిలంత కర్రలకి చుట్టి వరుసగా రంగుల కలయికలో ఉంచి, సంగీతంలో సరిగమల్లా (రంగుకి ఒక ఆకారం చొప్పున) రాసుకుని అది చూసి షాల్స్‌ అల్లుతారు. ‘హమ' అనే ఊరిలో జరీపని కూడా చేస్తారు. ఈ జరీపనిని ‘మావార్‌' అంటారు. పూర్వపు రాజులు, బాద్‌షాలు తలపాగాలు, నడుంకి కట్టుకునే పట్టాలు, అంగీలు, జరీపనితో వున్నవి ధరించేవారట. జరీపని వున్న షాల్‌ నేయటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.

Photo Courtesy: Utsav Verma

ఒక్కర్‌వాల్‌

ఒక్కర్‌వాల్‌

వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ‘ఒక్కర్‌వాల్‌' అంటే గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్తాన్‌ నుంచి గొర్రెల మందల్ని తెచ్చి గుల్మార్గ్‌, సోన్‌మార్గ్‌ల దగ్గరకొస్తారు. వాళ్లు మందల్ని తేవటం అంతా ఆర్మీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ గొర్రెల కాపరులు కుటుం బాలతో వచ్చి చలికాలం రాగానే వెళ్లిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే... ఇక్కడి కొన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా వున్నారు. ఆర్మీ యూనిట్లలో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాలు... అన్నీ ఒకే చోట వుంటాయి.

Photo Courtesy: Archit Ratan

వింటర్‌స్పోర్ట్స్‌ స్పాట్‌

వింటర్‌స్పోర్ట్స్‌ స్పాట్‌

హాలిడే స్పాట్‌గా ఖ్యాతి గాంచిన ఈ గుల్మార్గ్‌ రిసార్ట్స్‌... ఎప్పుడు చూసినా యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడి కేబుల్‌ కార్‌ విహారం చక్కటి అనుభూతినిస్తుంది. ప్రపంచం లోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్‌ క్రీడా మైదా నం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్‌ క్రీడకు గుల్మార్గ్‌ని ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Photo Courtesy : Archit Ratan

మహారాణి టెంపుల్

మహారాణి టెంపుల్

మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో కలదు. ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. ఈ టెంపుల్ ను మొహినేశ్వర్ శివాలయం గా పునరుద్ధరించి గుల్మార్గ్ లోని అన్ని మూలల నుండి కనపడేలా చేసారు. ఈ టెంపుల్ లో శివ , మాత పార్వతి వుంటారు. అన్ని సీజన్ల లోను భక్తులు వస్తారు. ఇక్కడ కల ప్రశాంత వాతావరణం లో భక్తులు ధ్యానాన్ని కూడా చేస్తారు.

Photo Courtesy: draskd

 గొందోలా లిఫ్ట్

గొందోలా లిఫ్ట్

గొందోలా లిఫ్ట్ అనేది ఒక కేబుల్ కారు. దీనిని కాశ్మీర్ ప్రభుత్వం ఆ ప్రదేశ అందాలను ఆకాశం నుండి చూపెటందుకు ఏర్పరించింది. సముద్ర మట్టానికి 13500 అడుగుల ఎత్తున కల ఈ లిఫ్ట్ రెండు మార్గాలు ప్రయాణిస్తుంది అవి గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ 5 కి. మీ.లు మరియు రెండవది కొంగ్దూర్ నుండి అఫర్వాట్ 2 కి.మీ.ల దూరంగా వుంటుంది. ఈ కేబుల్ కార్ లో పర్యాటకులు ప్రయాణించి ప్రాంత అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ వెళ్ళే మార్గం లో 19 టవర్లు తగులుతాయి. ఈ లిఫ్ట్ గంటకు 1500 మందిని చేరవేస్తుంది. కొంగ్దూర్ నుండి అఫార్వాట్ వెళ్ళే మార్గం లో 19 టవర్లు వుండి , ఇది సుమారు 600 మందిని గంటకు చేరవేస్తుంది.

Photo Courtesy: Utsav Verma

గుల్‌మార్గ్ కి ఎలా చేరుకోవచ్చు ??

గుల్‌మార్గ్ కి ఎలా చేరుకోవచ్చు ??

విమాన ప్రయాణం

గుల్మార్గ్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 56 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి జీపులు, టాక్సీలలో చేరవచ్చు. శ్రీనగర్ నుండి దేశం లోని ముంబై పూనే చండీగర్ వంటి అనేక ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

రైలు ప్రయాణం

గుల్మార్గ్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. ఇండియా లోని నార్త్ నగరాల వారు ట్రైన్ లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైలు స్టేషన్ ఇండియాలోని ముంబై, పూణే చండీగర్ వంటి పట్టణాలకు చక్కగా కలుపబడి వుంది.

రోడ్ ప్రయాణం

గుల్మార్గ్ పట్టణం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం తో కలుపబడి వుంది. పర్యాటకులు ప్రభుత్వ , ప్రైవేటు బస్సు లను ఉపయోగించవచ్చు, స్వంత కార్ల పై ప్రయాణించాలనుకునే వారు శ్రీనగర్ నుండి చేరవచ్చు.

Photo Courtesy: williewonker

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+