Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని పొడవైన హైవేల గుండా ప్ర‌యాణించారా?

దేశంలోని పొడవైన హైవేల గుండా ప్ర‌యాణించారా?

దేశంలోని పొడవైన హైవేల గుండా ప్ర‌యాణించారా?

భారతదేశం హైవేల దేశం అనడంలో సందేహం లేదు. ఉత్తరం నుండి దక్షిణానికి మరియు తూర్పు నుండి పడమరకు వెళ్లే హైవేలు దేశంలోని అనేక రాష్ట్రాలను ఒకదానితో ఒకటి కలుపుతాయి. హైవేల నెట్‌వర్క్ భారతదేశంలో లక్షల కిలోమీటర్లలో విస్తరించి ఉంది. సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ హైవేల గుండా వెళుతున్నారు. భారతదేశంలో 200 కంటే ఎక్కువ హైవేలు ఉన్నాయని తెలుసా? ఇవి రాష్ట్రాల ద్వారా దేశాన్ని కలుపుతాయ‌న్న విష‌యం తెలుసా? భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా వెళుతున్న అటువంటి పొడవైన రహదారుల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం ప‌దండి..

nh443745kms1

NH44 (3745 కిలోమీట‌ర్లు)

NH44 భారతదేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి. ఇది సుమారు 3,745 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుండి ప్రారంభమై త‌మిళ‌నాడులోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. ఈ జాతీయ రహదారి ఉత్తర-దక్షిణ కారిడార్‌లో భాగమైన ఏడు ప్రధాన పాత జాతీయ రహదారులను కలిగి ఉంది. ఈ మార్గం చాలా పొడవుగా ఉంటుంది. ఈ మార్గానికి దేశంలోని 21 ప్రధాన నగరాలు అనుసంధానించబడి ఉన్నాయి. NH 44 ను ఇంతకు ముందు NH 7 అని కూడా పిలిచేవారు.

nh273507kms1

NH27 (3507 కిలోమీట‌ర్లు)

NH 44 తర్వాత, NH 27 కిలోమీటర్లు పరంగా భారతదేశంలో రెండవ పొడవైన రహదారి. ఈ జాతీయ రహదారి దాదాపు 3,507 కిలోమీట‌ర్లు. ఈ జాతీయ రహదారి పోర్‌బందర్ మరియు సిల్చార్‌లను కలుపుతుంది. NH 27 గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ అలాగే ఇతర భారతీయ రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతుంది.

nh482807kms

NH48 (2807 కిలోమీట‌ర్లు)

NH 48 దూరం దాదాపు 2,807 కిలోమీట‌ర్లు. ఈ ర‌హ‌దారి ఢిల్లీ నుంచి ప్రారంభమై చెన్నైలో ముగుస్తుంది. ఈ జాతీయ రహదారి ఢిల్లీ మరియు జైపూర్‌లను కలుపడ‌మే కాకుండా, చాలా దూరం వరకు విస్తరించి ఉంది. మంగళూరు నుండి నెలమంగళ వరకు ఈ మార్గం దేశంలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ మార్గం గుండా రెండు వైపులా అందమైన దృశ్యాలు ప‌ర్యాట‌కులను క‌నువిందు చేస్తాయి. ఈ రహదారి హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా వెళుతుంది.

nh522317kms

NH52 (2317 కిలోమీట‌ర్లు)

జాతీయ రహదారి 52 (NH 52) పంజాబ్‌లోని సంగ్రూర్‌ని కర్నాటకలోని అంకోలాను కలుపుతుంది. దీని పొడవు 2317 కిలోమీట‌ర్లు. ఈ రహదారిని గతంలో NH17 అని కూడా పిలిచేవారు. కర్ణాటకలోని అంకోలా మరియు ఆంధ్రప్రదేశ్‌లోని గూటి గతంలో NH-63 మార్గం ద్వారా అనుసంధానించబడ్డాయి. హైవే 52 జాతీయ రహదారి 66 అంకోలా జంక్షన్ వద్ద ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ మార్గం పశ్చిమ కనుమలలోని అరబెల్ ఘాట్ వరకు, తర్వాత‌ ఎల్లపురా మరియు చివరకు హుబ్లీ వరకు ప్రయాణిస్తుంది.

NH30 (1984 కిలోమీట‌ర్లు)

జాతీయ రహదారి 30 సుమారుగా 1,984 కిలోమీట‌ర్లు విస్తరించి ఉంది. ఈ ర‌హ‌దారిని దేశంలోని ప్రాథమిక జాతీయ రహదారులలో ఒకటిగా పరిగణించారు. ఈ హైవే ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌ని ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నంను కలుపుతుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను కవర్ చేసే మార్గంలో అనేక ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. NH-30ని ఇంతకుముందు నేషనల్ హైవే-221గా పిలిచేవారు.

More News

    Read more about: nh44 road nh27 road
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+