Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు చుట్టుపక్కల ఆకర్షణలు !

బెంగుళూరు చుట్టుపక్కల ఆకర్షణలు !

బెంగుళూరు నగర జనాభా సుమారుగా 85 లక్షలకు మించిపోతోంది. ఈ జనాభా లో ఆసక్తి కల పర్యాటకులు కూడా అధికమే. వీరు ఎల్లపుడూ తాము అప్పటి వరకూ చూడని ప్రదేశాలు చూడాలని తహ తహ లాడుతూంటారు. కొత్త ప్రదేశాల అన్వేషణకు నడుం కడతారు. అధికమైన రిలాక్సేషన్ కోరే వారికి, సాహస ట్రెక్కింగ్ క్రీడలు వంటివి చేయాలనుకునే వారికి నగరం కంటే కూడా నగరం చుట్టూ కల కొండ ప్రాంతాలలో విశ్రాంతి లేదా హాలిడే ప్రోగ్రాం లు సిఫార్సు చేయవచ్చు. వీక్ ఎండ్ ప్రోగ్రాం లలో త్వరితంగా వెళ్లి తిరిగి నగరం చేరుకోవాలనుకునే వారికి ఈ సూచించిన ప్రదేశాలు తప్పక ఆహ్లాదాన్ని పంచి పూర్తి విశ్రాంతినిస్తాయి. మరి అటువంటి ప్రదేశాలు బెంగుళూరు చుట్టుపక్కల ఏమి కలవో పరిశీలిద్దాం.

సావన్ దుర్గ

సావన్ దుర్గ

సావన్ దుర్గ కొండలు బెంగుళూరుకు పడమటగా 60 కి. మీ. ల దూరంలో మాగడి రోడ్ వైపు కలవు. ఈ కొండలు ఆసియాలోనే అతి పెద్ద ఏకశిలా కొండలుగా ఖ్యాతి గాంచాయి. సావన్ దుర్గ కొండలు దక్కన్ పీట భూమిలో ఒక భాగంగా రెండు కొండల తో ఏర్పడ్డాయి. వీటిని బ్లాకు హిల్ మరియు వైట్ హిల్ అని పిలుస్తారు. ఆర్కావతి నది ఈ కొండల సమీపంలో టి జి హళ్లి డాం ద్వారా మంచనబెలె డాం వైపుగా ప్రవహిస్తుంది.
Photo Courtesy: Sudarshana

రామనగర కొండలు

రామనగర కొండలు

రామనగరం సిటీని సిల్క్ సిటీ అని కూడా అంటారు. రామ దేవర బెట్ట అనే ఈప్రదేశంలో ప్రసిద్ధ హిందీ సినిమా షో లే ఫిలిం కూడా షూట్ చేసారు. ఈ కొండలపై ట్రెక్కింగ్ అమిత ఆనందం కలిగిస్తుంది. రామ నగరం దాని సహజ అందాలతో తప్పక చూడ దగిన ప్రదేశం.

నంది హిల్స్

నంది హిల్స్

నంది హిల్స్ ట్రెక్కింగ్ చేయాలంటే, సూర్యోదయం లోపు మొదలు పెట్టాలి. ఈప్రదేశానికి చాలామది సైకిల్ పై కూడా వస్తారు. ఇక్కడ కల ప్రత్యేకత సూర్యోదయం. దానిని చూడకుంటే, మీ ట్రిప్ అంత వృధా అని చెప్పక తప్పదు. నంది హిల్స్ కు సమీపంలోని కల లేపాక్షి కూడా తప్పక చూడదగిన పర్యాటక ప్రదేశం.

Photo Courtesy: Harsha K R

స్కందగిరి

స్కందగిరి

స్కందగిరి బెంగుళూరు కు 70 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఒక పురాతన పర్వత కోట. ఇది బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో కలదు. దీనిని స్థానికులు కలవర దుర్గ అని కూడా అంటారు. ఈ కొండ పై నుండి నంది హిల్స్ కూడా చూడవచ్చు.
Photo Courtesy: Kalyan Kanuri

మాకలిదుర్గ

మాకలిదుర్గ

మాకలి దుర్గ ఒక కోట పట్టణం. ఇది బెంగుళూరు కు 60 కి. మీ. ల దూరంలో కలదు. ఈ కోట ఒక కొండపై ఉండటంతో ట్రెక్కింగ్ లో చూడటం అనుకూలం. మాకలి దుర్గ చేరాలంటే, రైల్వే స్టేషన్ కలదు. ఈ కొండపై, రాపెల్లింగ్, బర్డ్ వాచింగ్ వంటివి కూడా చేయవచ్చు. Photo Courtesy: Karthik Prabhu

బిలికల్ బెట్ట

బిలికల్ బెట్ట

దీనిని బిలికల్ రంగస్వామి బెట్ట అని కూడా అంటారు. ఈ కొండలు కనకపుర పర్వత శ్రేణులలో కలవు. సాధారణంగా ఎవరూ అన్వేషించని ఈ ప్రాంతం అంతా అటవీ పొదలు కలిగి వుంటుంది. బెంగుళూరు కు దక్షిణంగా 70 కి. మీ. ల దూరంలో కలదు. కొండపై శ్రీ రంగనాథస్వామి టెంపుల్ కూడా కలదు.
Photo Courtesy: Aditya Patawari

భీమేశ్వరి

భీమేశ్వరి

భీమేశ్వరి ట్రిప్ ఆనందాలను పూర్తిగా అనుభవించాలంటే, ఇక్కడ కల జంగల్ లాజ్ లలో వసతి తీసుకోవాలి. ఈ ప్రదేశం అడ్వెంచర్ మరియు ప్రకృతి అందాల కలయిక. ట్రెక్కింగ్ ప్రోగ్రాం లకు భీమేశ్వరి ప్రదేశాన్ని నెం. 1 జాబితాలో చేర్చవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+