Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ - చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు !

విజయవాడ - చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు !

విజయవాడ ఒక వాణిజ్య కేంద్రం. దీనిని బెజవాడ అని కూడా అంటారు. అతి పరిశుభ్రమైన నగరంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే గుర్తించబడినది. దక్షిణ భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కృష్ణా జిల్లాలో కృష్ణా నదీ తీరాన కలదు. రాష్ట్రం లో విశాఖపట్నం నగరం తర్వాత విజయవాడ రెండవ అతి పెద్ద నగరం గా పరిగనిన్చబడుతోంది. ఈ నగరాన్ని "భవిష్యత్ గ్లోబల్ సిటీ"గా పేర్కొంటారు. కృష్ణ జిల్లాలో ౩% ప్రదేశ పరంగానూ జిల్లాలో 33 శాతం జనాభా పరంగానూ ఈ నగరం ప్రసిద్ధి కెక్కింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు, బస్సు మార్గాలు కలవు. విజయవాడకు స్థానిక విమానాశ్రయం కలదు.అతి పెద్ద రైల్వే జంక్షన్ కల ఈ నగరం రాజకీయంగా ఎల్లపుడూ చురుకుగాను, వ్యవసాయ పరంగా సమృద్ధి గానూ మరియు పారిశ్రామిక రవాణా కేంద్రంగానూ పేరు తెచ్చుకుంది. ఎల్లపుడూ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించే విజయవాడ పర్యాటక పరంగా కూడా ఇపుడిపుడే అభివృద్ధి చెందుతోంది. విజయవాడ నగరం చుట్టుపక్కల కల పర్యాటక ఆకర్షణలు పరిశీలిద్దాం.

విజయవాడ హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

1. ప్రకాశం బెరేజ్

ప్రకాశం బెరేజ్ కృష్ణా నది పై నిర్మించబడినది. దీని పొడవు 1223.5 మీ. లు. ఈ బ్రిడ్జి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం 1957 సంవత్సరంలో పూర్తి అయినది. దీనికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట మొదటి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం పెట్టారు. ఈ డాము వలన ఈ ప్రాంతంలో సుమారు 1.2 మిలియన్ ఎకరాల వ్యవసాయ భూమి సాగులోకి వచ్చింది. ఈ బ్రిడ్జి విజయవాడ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ

Photo courtesy : Amar raavi

2. ఉండవల్లి గుహలు
ఉండవల్లి గుహలు ఒకే కొండలో తొలచబడ్డాయి. పురాతన విశ్వకర్మ స్థపతి లకు ఒక సరైన ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇవి విజయవాడకు పడమటి దిశగా 6 కి. మీ. ల దూరంలో కృష్ణా నది కి దక్షిణపు ఒడ్డున కలవు. గుంటూరు నగరానికి 22 కి. మీ. లు. దూరంలో కలవు.

Photo courtesy : Ramireddy.y

3. కృష్ణవేణి మండపం :
కృష్ణ వేణి మండపం ను రివర్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇది ప్రకాశం బరేజ్ కు సమీపంలో కలదు. ఈ మ్యూజియం లో కృష్ణా నది కి గల చరిత్ర ప్రదర్సిన్చబడుతుంది. బరేజ్ పక్కనే ప్రసిద్ధ కృష్ణమ్మనదీ దేవత విగ్రహం కూడా స్థాపించారు.

4. రాజీవ్ గాంధి పార్క్
రాజీవ్ గాంధి పార్క్ ను విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్మించింది. ఆకర్షణీయమైన తోటల పెంపకంతో విజయవాడ ప్రవేశ ద్వారంగా కలదు. ఇక్కడే ఒక మినీ జూ మరియు ఒక మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ లు కూడా కలవు. ఈ పార్క్ మధ్యాహ్నం 2 గం. నుండి 8 గం వరకూ తెరచి వుంటుంది.

5. గాంధి హిల్
గాంధి హిల్ పై భాగంలో మొట్ట మొదటి గాంధి మెమోరియల్ ఏడు స్తూపాలతో కొండపై 150 మీ. ల ఎత్తున ఇక్కడ స్థాపించారు. ఈ స్తూపం పొడవు 16 మీ. లు. దీనిని అప్పటి భారత దేశ రాష్ట్రపతి డా. జాకీర్ హుస్సేన్, 6 అక్టోబర్, 1968 న ఆవిష్కరించారు. ఈ కొండపై గాంధి మెమోరియల్ లైబ్రరీ, మహాత్మా గాంధి జీవిత విశేషాలతో కల ఒక సౌండ్ అండ్ లైట్ షో మరియు ఒక ప్లానేటోరియం లు ఇతర ఆకర్షణలు.

6. విక్టోరియ జూబిలీ మ్యూజియం
పురావస్తు ప్రియులకు ఇది ఒక ఆసక్తి కర మ్యూజియం. దీనిలో అనేక పురాతన శిల్పాలు, పెయింటింగ్ లు, విగ్రహాలు, ఆయుధాలు, కట్లరి, మరియు శిలా శాశనాలు కలవు.

7. మొగలరాజపురం గుహలు
ఈకొండ గుహలను సుమారు క్రి. శ. 5 వ శతాబ్దంలో తవ్వి నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటిసారిగా కనుగోన్నబడిన గుహలు. ఇక్కడ శ్రీ నటరాజ, వినాయక మరియు అర్థనారీశ్వర విగ్రహాలు ఇక్కడ చెక్కబడ్డాయి. .

8.భవానీ ఐలాండ్
కృష్ణా నదిపై ఈ ద్వీపాలు అతి విస్తారమైనవి. నగరానికి సమీపంగా కలవు. ఈ ప్రదేశాన్ని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ సుమారు 133 ఎకరాలలో ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశంగా మరియు ఒక రివర్ ఫ్రంట్ రిసార్ట్ గా అభివృద్ధి చేసింది.

9. కొండపల్లి ఫోర్ట్
కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి సుమారు 16 కి. మీ. ల దూరంలో కలదు. ఈ కోట సుమారు 7 వ శతాబ్దం నాటిదిగా చెపుతారు. ఇక్కడ కల ఆకర్షణీయమైన ఒక మూడు అంతస్తుల రాక్ టవర్ ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక రాజ వంశాల గొప్పతనం చాటుతుంది. ఈ కోటను రాజు కృష్ణ దేవా రాయలు నిర్మించాడు. ఇది ఒక వాణిజ్య కేంద్రంగా కూడా పేరు కెక్కింది. ఈ కోట బ్రిటిష్ పాలకులకు మిలిటరీ ట్రైనింగ్ బేస్ గా వుండేది. ఒక మంచి విహార కేంద్రం. కొండపల్లి గ్రామం, ఇక్కడి అటవీ ప్రాంతంలో దొరికే చెక్క తో తయారు చేయబడిన తక్కువ బరువు కల అందమైన కొయ్య బొమ్మలు, ఇతర వస్తువుల తయారీకి ప్రసిద్ధి. ఇవి "కొండపల్లి బొమ్మలు" అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కాయి.

భవిష్యత్ గ్లోబల్ నగరం

Photo courtesy: Man_praveen

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+