Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి సమీప జలపాతాలు !

తిరుపతి సమీప జలపాతాలు !

By Mohammad

తిరుపతికి చాలా మంది వెళ్లివస్తుంటారు. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించి తన కోర్కెలను నెరవేర్చుకుంటారు. కోరిన కోర్కెలను తీర్చే స్వామి గా వెంకటేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అంతటి దివ్య క్షేత్రం అయిన తిరుపతికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చేయాలో చెప్పేదే ప్రస్తుత ఈ వ్యాసం.

తిరుపతి కి వెళ్లాలని ప్లాన్ చేసుకునేటప్పుడు ముందుగా దైవ దర్శనానికి సమయాన్ని కేటాయించాలి. ఆతరువాత అక్కడ చూడవలసిన ప్రదేశాలను చూడటానికి సమయాన్ని కేటాయించాలి. మీరు ఒక రెండు రోజులు తిరుపతి లో మకాం వేసినట్లయితే, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను తనివితీరా చూసి రావచ్చు. ఒక్కోదాన్ని దగ్గరగా చూసి ఆనందించవచ్చు.

తిరుపతి గురించి ఇదివరకు మీరు ఎన్నో వ్యాసాలు చదివే ఉంటారు. కానీ ఈ వ్యాసం ప్రత్యేకం. ఇక్కడ మీకు చెప్పబోయేది తిరుపతి చుట్టుపక్కల ఉన్న జలపాతాల గురించి. ఇది మాన్సూన్ సీజన్ కదా ! అందుకే.

తిరుపతి వెళితే తలకోన లేదంటే కపిలతీర్థం. ఇవేగా చూసేది. వీటితో పాటు తిరుపతి లో చూడవలసిన జలపాతాలు ఇంకా ఉన్నాయి. అవేంటో చదవండి మరి !

తలకోన

తలకోన

తలకోన తిరుపతి కి 49 కిలోమీటర్ల దూరంలో తిరుపతి కొండల్లో కలదు. సుమారు 60 మీటర్ల ఎత్తు నుండి కింద పడే నీటిధారలు పర్యాటకులను ముగ్ధులను చేస్తుంటాయి. జలపాతం కింద ఉన్న గుంట లో హాయిగా జలకాలాట ఆడుకోవచ్చు. ఇక్కడికి సమీపంలో సిద్దేశ్వర స్వామి ఆలయం కలదు. శివరాత్రి పర్వదినాన భక్తులు అధికంగా వస్తుంటారు.

చిత్ర కృప : VinothChandar

పాపవినాశనం తీర్థం

పాపవినాశనం తీర్థం

పాపవినాశన తీర్థం తిరుమల కు 2 మైళ్ళ దోరంలో కలదు. ఇక్కడ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పాపాల నుండి విముక్తి చెందుతారు. ఆడవారికి, మగవారికి ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూం లు కలవు. సమీపంలోని డ్యాం చూడదగ్గది.

చిత్ర కృప : jaiganesh photos

సనక సనందన తీర్థం

సనక సనందన తీర్థం

తిరుపతి సమీపంలో ఉన్న మరో జలపాతం సనక సనందన తీర్థం. దీనికి ఆ పేరు ఇద్దరు ఋషులైన సనక మరియు సనందన పేర్ల నుండి వచ్చింది. పురాణ కథనం మేరకు ఈ ఇద్దరు ఋషులు వేంకటేశ్వరుడిని దర్శించుకోవటానికి వెళితే, అక్కడ ఉన్న ఇద్దరు ద్వారపాలకులు జయ మరియు విజయ అడ్డుకుంటారు. ఆగ్రహించిన ఋషులు ఇద్దరికీ శాపం పెడతారు. ఆ శాపాన్ని మూడు జన్మలు అనుభవించిన ఆ ఇయాదృ ద్వారపాలకులు తిరిగి వైకుంఠ ద్వారపాలకులుగా నియమితులైతారు. ఈ జలపాత తీర్థం నీరు దివ్యమైనది కనుకే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

ఆకాశగంగా తీర్థం

ఆకాశగంగా తీర్థం

శ్రీ వెంకటేశ్వర ఆలయానికిసమీపాన ఉన్న మరొక జలపాతం ఆకాశ గంగా. ఇక్కడికి వెళ్లాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. తిరుపతి ప్రధాన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. జలపాతాన్ని వర్షాకాల సమయంలో సందర్శిస్తే, వేగంగా పడే నీటిధారలు ఆకట్టుకుంటాయి.

కైలాసనాథ కొండ జలపాతం

కైలాసనాథ కొండ జలపాతం

తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో కైలాస నాథ జలపాతం కలదు. చెన్నై వెళ్లే దారిలో నాగలాపురం అవతల బస్సు దిగి 2 కిలోమీటర్లు వెళితే అద్భుత కైలాస నాథ జలపాతం వస్తుంది. అగష్టు, ఫిబ్రవరి మధ్య కాలం ఈ ప్రదేశం సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఈ జలపాతపు నీటిలో వ్యాధినిర్మూలన శక్తి ఉందని ప్రతీతి.

వైకుంఠ తీర్థం

వైకుంఠ తీర్థం

వైకుంఠ తీర్థం ప్రధాన ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో కలదు. రాముని వానరసేనలకు ఇక్కడ వైకుంఠం కనిపించిందని, అందుకే వైకుంఠ తీర్థం అనే పేరొచ్చిందని అంటారు. ఇక్కడ మునక వేస్తే పాపాలు పోయి, మంచి జరుగుతుందని విశ్వాసం.

కపిల తీర్థం

కపిల తీర్థం

వైకుంఠంలో శివాలయం అంటే .. అది కపిల తీర్థమే ! . తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయం కపిల తీర్ధం. ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు. ఆలయం పక్కనే నీటిధారల జలపాతం కలదు.

చిత్ర కృప : kkalyan

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+