Search
  • Follow NativePlanet
Share
» »వారాంతపు విహారం - బెంగుళూరు నుండి కూర్గ్ !

వారాంతపు విహారం - బెంగుళూరు నుండి కూర్గ్ !

పడమటి కనుమల ఒడిలో ఒదిగి వ్లున్న చిన్న పట్టణం కూర్గ్ ను ఆంగ్లం లో కొడగు అంటారు. ఈ పట్టణం పూర్తిగా కాఫీ తోటలు, అనేక జలపాతాలు, పొగ మంచు నిండిన కొండలు, అత్యంత సౌకర్యమైన అతిధి గృహాలు కలిగి వుంది. కొడవ యోధులకు నివాసమైన కూర్గ్ పట్టణం ఒక ప్రశాంత ప్రదేశం. అనేక విహార ప్రదేశాలు కలిగి వుంది. బెంగుళూరు నుండి కూర్గ్ వరకూ గల మార్గం సైతం ఎన్నో ప్రకృతి దృశ్యాలు, ఆసక్త్లి కల ప్రదేశాలు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. సిల్క్ సిటీ రామనగరం, చెక్క బొమ్మల చన్న పట్టణ వంటి వాటి లో మీరు గంగ వంశ పాలకుల, టిప్పు సుల్తాన్ కాల, కీర్తి ప్రతిష్టలు, బౌద్ధ సంస్కృతి , వన్య జీవుల నివాసాలైన కొన్ని సాన్క్చురి లు చూడవచ్చు.

కూర్గ్ పట్టణం చేరాలంటే, రెండు మార్గాలు కలవు. మీకు గల సమయం మరియు సౌకర్యం బట్టి ఎదో ఒక రూట్ ఎంచుకొనవచ్చు. మేం మీకు రెండు రూట్ లు వివరిస్తున్నాము. రోడ్ పరిస్థితి బట్టి ప్రయాణ సమయం 8-10 గంటలు పట్టగలదు.హున్సూర్ నుండి కూర్గ్ వరకు రోడ్డు బాగుంటుంది. అయితే, హున్సుర్ నుండి నాగర హోల్ వరకు రోడ్ కండిషన్ సరిగా వుండదు.

రామనగరం

రామనగరం

బెంగుళూరు లో ప్రయాణం మొదలు పెడితే, ముందుగా మీరు రామానగరం చేరతారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు, రాక్ క్లైమ్బింగ్ కు ప్రసిద్ధి. ఇవి మీకు నచ్చకపోతే, ప్రసిద్ధ హిందీ సినిమా షోలే షూటింగ్ జరిగిన కొండలు, 'రాం ఘర్ ' టవున్ చూసి ఆనందించండి.

చన్న పట్న

చన్న పట్న

మీ మార్గంలో తర్వాత వచ్చేది చన్న పట్న. ఈ పట్నం, టిప్పు సుల్తాన్ కాలంనాటిది. చక్క బొమ్మలు ఈ ప్రాంతంలో స్థానికులకు తయారు చేసే శిక్షణ ఇప్పించేందుకు కళాకారులను పర్షియా నుండి పిలిపించాడు. ఈ ప్రాంత చక్క బొమ్మలు చాలా ప్రసిద్ధి.

Pic credit: Wiki Commons

మద్దూర్

మద్దూర్

చన్న పట్న తరువాత రోడ్డు ప్రయాణంలో మీరు చేరేది మద్దూర్. మద్దూర్ లో వడలు ఫేమస్. రుచికరంగా వుంటాయి. తినటం మరువకండి.

శ్రీరంగపట్న

శ్రీరంగపట్న

శ్రీరంగపట్నం కు ఆ పేరు అక్కడ కల 9 వ శతాబ్దం నాటి రంగనాథ స్వామి టెంపుల్ వలన వచ్చింది. శ్రీరంగ పట్నం లో ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి. ఈ టెంపుల్ నిర్మాణంలో హోయసలు మరియు విజయనగర పాలకుల శిల్ప కళా వైభవం కనపడుతుంది. 17 వ శతాబ్దం నాటి ఇక్కడ కల జామా మసీద్, దర్యా దౌలత్ బాగ్, టిప్పు సుల్తాన్ వేసవి పాలస్ మొదలైనవి కూడా చూడవచ్చు.

Pic credit: Wiki Commons

గోల్డెన్ మొనాస్టరీ

గోల్డెన్ మొనాస్టరీ

కుశాల్ నగర్ వెళ్ళే మార్గంలో మీరు బైల కుప్పె ప్రదేశం చూడవచ్చు. ఇది ఇండియా లోని టిబెట్ దేశస్థుల స్థావరాలలో ఒకటి. ఇక్కడ నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ ప్రసిద్ధి. ఇక్కడ కల న్యింగ్ మాపా టీచింగ్ సెంటర్ ప్రపంచం లోనే పెద్దది. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ప్రధాన ఆకర్షణ. ఈ కాంప్లెక్స్ లో ఇతర టెంపుల్స్, ఒక సన్యాస ఆశ్రమం, సన్యాసుల వసతులు , సావ్ నీర్ షాప్ లు కలవు.

Pic credit: Ashok666

నిసర్గధామ

నిసర్గధామ

మత పర ప్రదేశం బైల కుప్పె చూసిన తర్వాత, వెరైటీ గా ప్రకృతి అందాలు కల నిసర్గ ధామ చేరండి. నిసర్గ ధామ ఒక ద్వీపం, కావేరి నది లో కలదు. ఇక్కడ మీరు అనేక వెదురు తోటలు , చూడవచ్చు, చిన్న పక్షులు, జంతువులు కూడా వుంటాయి. దీనిని ఒక రోప్ బ్రిడ్జి ద్వారా చేరాలి. స్థానికులు, టూరిస్ట్ లు ఈ ప్రదేశాన్ని అమితంగా ఇష్టపడతారు. ఇక్కడ నుండి మీరు మడి కేరి చేరవచ్చు. మార్గం పొడవునా అనేక కాఫీ లేదా సుగంధపు ద్రవ్యాల తోటలు చూస్తూ ప్రయాణం చేయవచ్చు.

Pic credit: Viswaprasad Raju

నాగరహోలె

నాగరహోలె

నాగరహోలె వైల్డ్ లైఫ్ సాన్క్చురి మార్గం వయా నాగర హోలే వైల్డ్ లైఫ్ సాన్క్చురి గుండా వెళ్ళవచ్చు. హున్సుర్ దాటినా తర్వాత, మీరు ఎడమవైపు త్లిరిగి నాగార్హోలె వైల్డ్ లైఫ్ సాన్క్చురి ద్వారా కూర్గ్ చేరవచ్చు. ఈ ప్రదేశం ఆసియా ఏనుగులకు మంచి నివాసం. వర్ష రుతువులోను, సంతానోత్పత్తి సమయంలోను దీనిని మూసి వేస్తారు. మీరు ఈ మార్గం ఎంపిక చేస్తే, ఉదయమే బయలు దేరితే, వన్య జంతువులను కూడా చూడవచ్చు. మడి కేరి నుండి త్లిరిగి వచ్చేటపుడు కూడా ఈ రూట్ లో రావచ్చు.

Pic credit: native planet

బ్రహ్మ గిరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి

బ్రహ్మ గిరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి

ఇరుప్పు జలపాతాలకు వెళ్ళినపుడు, అక్కడ కల ఆకర్షణీయ బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి , ఎత్తైన బ్రహ్మ గిరి శిఖరం, వంటివి చూడవచ్చు.

కాబిని రిజర్వు ఫారెస్ట్

కాబిని రిజర్వు ఫారెస్ట్

మార్గంలో కల కాబిని రిజర్వు ఫారెస్ట్ కూడా చూసి ఆనందించండి. ఈ ప్రాంతానికి సంవత్సరం అంతా అనుమతి వుంటుంది. రాష్ట్రంలో వన్య జంతువుల సందర్శనకు ఇది ఒక మంచి ప్రదేశం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+