ఉదయగిరి గుహల పక్కనే 15 నుంచి 20 మీటర్ల దూరంలో వున్నాయి. కొన్ని మెట్ల మీద నుంచి చేరుకోగలిగే ఈ ప్రాంతం మిమ్మల్ని చరిత్రలోకి తీసుకు వెళ్తుంది. ఇక్కడ వున్న మొత్తం 15 గుహలు ప్రధానంగా జైన సన్యాసుల నివాసం కోసం కట్టారు. 2000 ఏళ్ళ వయసున్న ఈ గుహల గోడల మీద శాసనాలు, శిల్పాలు చెక్కి వున్నాయి. రాతిలో చిత్రించిన బొమ్మలతో పాటు, అద్వితీయమైన చిహ్నాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ బ్రహ్మాండమైన కొండ పైన వున్న అందంగా చెక్కిన జైన దేవాలయం 18 వ శతాబ్దం నాటికి చెందింది. ప్రతి ఏటా జనవరి చివరిలో, చాలా మంది సాధువులు ఇక్కడ గుమికూడి హిందూ పురాణాల నుంచి స్తోత్రాలు చదివి, ధ్యానం చేసుకుంటారు. అదే సమయంలో చాలా మంది జనాన్ని ఆకర్షించే సంత కూడా జరుగుతుంది.



Click it and Unblock the Notifications