ఉదయగిరి, రత్నగిరి లతో కలిసి లలితగిరి ‘పుష్ప విశ్వవిద్యాలయం’ లేదా ‘డైమండ్ త్రికోణం’ అవుతుంది – ఇక్కడ ఇప్పటి దాకా కనుగొన్న వాటిలో అతి ప్రాచీనమైన బౌద్ధ సముదాయాలు వున్నాయి. ఉదయగిరి నుంచి 27 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రదేశంలో గౌతమ బుద్ధుడి అస్థికలతో పాటు క్రీ.శ. 1 వ శతాబ్దానికి చెందిన ఇతర ప్రాచీన పురావస్తు తవ్వకాలు కూడా వున్న మ్యూజియం ప్రధాన ఆకర్షణ.
వివిధ భంగిమల్లో వున్న బుద్ధ విగ్రహాలతో పాటు, వివిధ హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఇక్కడ దొరికిన పాత బంగారు, వెండి ఆభరణాలు ఇక్కడ ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచారు. ఈ ఇసుకరాతి కొండ శిఖరం మీద పచ్చటి పొలాల నేపథ్యంలో ఇటుకతో నిర్మించిన శిధిలమైన ఆశ్రమం, కొన్ని స్తూపాలు, చైత్య మందిరం, పునరుద్ధరించిన రాతి స్థూపం వున్నాయి. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ వారి సంరక్షణలో వున్న లలితగిరి లో చాలా శిల్పాలున్న ఒక దేవాలయం శిధిలాలు కూడా వున్నాయి.



Click it and Unblock the Notifications