ముందకాయం ఘాట్ వాగమోన్ హిల్ స్టేషన్ కు 8 కి.మీ.ల దూరంలో కలదు. సూర్యాస్తమయం చూసేందుకు సుందరమైన ప్రదేశం. ఇక్కడి ప్రదేశంలో బర్డ్ వాచింగ్ కూడా చేయవచ్చు. సమీపంలోని ఇతర పరిసరాలు కూడా ఈ ఘాట్ నుండి చూడవచ్చు. ఒంటరితనం కోరుకునేవారు, ప్రకృతి ప్రియులు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు.
అయితే, ఈప్రదేశానికి సాహస క్రీడలు చేసే వారు కూడా వస్తారు. ఇక్కడ పారాగ్లైడింగ్ పండుగ నిర్వహిస్తారు. పారాగ్లైడింగ్ కారణంగా ముందకాయం ఘాట్ ప్రసిద్ధి చెందుతోంది. పారాగ్లైడింగ్ పోటీలను ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ సస్టెయినబుల్ టూరిజం అకాడమీ నిర్వహిస్తుంది.



Click it and Unblock the Notifications