Search
  • Follow NativePlanet
Share

వేణూర్ - యాత్రికులకు మరియు పర్యాటకులకు ఒకే కేంద్రం

4

జైన మతస్థులకు వేణూర్ ఒక ప్రధాన యాత్రా స్ధలం. ఈ చిన్న పట్టణంగురుపూర్ నది ఒడ్డున ఉంది. నేడు తన ప్రాధాన్యతను కోల్పోయినప్పటికి, చరిత్రలోకి వెళితే, ఈ పట్టణం ఒకప్పుడు జైన మతానికి ఎంతో ప్రధాన కేంద్రంగా ఉండి అజిల వంశ పాలకులకు రాజధానిగా ఉండేది.  

జైనుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని నాలుగు ఏకశిలా గోమతేశ్వర విగ్రహాలలో ఇది ఒకటి.

వేణూర్ పట్టణంలో అనేక పురాతన జైన మందిరాలు చూడదగినవి కలవు. గ్రామీణ ప్రాంతంలో ఏడు పురాతన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలు అద్భుత శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఆకాలం నాటి వైభవానికి చిహ్నంగా ఉంటాయి. గోమతేశ్వర విగ్రహానికి ఇరుపక్కలా రెండు దేవాలయాలుంటాయి. సహజ అందాలకు నిలయమైన ఈ ప్రదేశం  సహ్యాద్రి హిల్స్ సమీపంలో ఉండి మరింత అందచందాలను సంతరించుకొంది. వేణూర్ పట్టణం, జైనుల ఇతర కేంద్రాలైన ధర్మస్ధల మరియు కర్కాల పట్టణాలకు సమీపంలో ఉంది.

వేణూర్ దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. మంగుళూరుకు సౌకర్యవంతమైన రోడ్డు కలదు. ఇక్కడనుండి టాక్సీలు, బస్సులలో ఉడుపి కూడా చేరవచ్చు.  

వేణూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వేణూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వేణూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వేణూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ మార్గం - మంగుళూరు లేదా ఇతర సమీప ప్రదేశాలనుండి పర్యాటకులు ప్రభుత్వ బస్ లలో కూడా చేరవచ్చు. అనేక ప్రయివేటు వాహనాలు మంగుళూరు నుండి వేణూర్ కు నడుపబడుతున్నాయి. పర్యాటకులు ప్రయివేటు టాక్సీలు, టయోటా, కవాలిస్ వంటి వాటిని కూడా ఉపయోగించి సౌకర్యంగా రావచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం - వేణూర్ కు రైలు స్టేషన్ లేదు. మంగుళూరు రైలు స్టేషన్ సమీప రైలు జంక్షన్. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైలు సౌకర్యం కలదు. టూరిస్టులు ఇక్కడినుండి టాక్సీలు మరియు క్యాబ్ లలో వేణూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం వేణూరుకు 50 కి.మీ. ల దూరంలో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి స్ధానిక విమానాశ్రయంగా ఉంది. పర్యాటకులు ఇక్కడనుండి వేమూర్ గ్రామానికి టాక్సీలు, బస్సులలో చేరవచ్చు. ఇతర దేశాల పర్యాటకులు బెంగుళూరులోని దేవన హళ్ళి విమానాశ్రయం నుండి కూడా చేరవచ్చు. ఈ విమానాశ్రయం నుండి వేణూర్ 290 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue

Near by City