టణం లో ప్రసిద్ధి చెందిన ఒక పర్యాటక ఆకర్షణ. స్థానిక పురాణగాథల ప్రకారం ఇక్కడి శిఖరాలలో ఒకప్పుడు ఉన్న పండ్లతోటలను అదృష్టవంతులు మాత్రమే చూడగలిగే వారు. ప్రస్తుతం ఈ శిఖర సందర్శన లో కనువిందు కల్గించే రంగురంగుల రోడోడెండ్రాన్ లు కనబడతాయి. లోథాలు, సెమాలు, అవోలు వంటి తెగలు ఈ ప్రాంతాన్ని వారి పూర్వీకుల ఆత్మలు ఉన్న సురక్షిత స్థానంగా విశ్వసిస్తారు.
ఈ శిఖరం నుండి పచ్చటి కాన్వాస్ పైన చిన్న చిన్న ఇళ్ళు చిత్రించినట్టుగా కనబడే లోయను, దిగువన ఉన్న గ్రామాల అందమైన దృశ్యాలను గమనించవచ్చు. ఈ శిఖరం పై నుండి సూర్యాస్తమయ దృశ్యాలు తప్పక చూడవలసిన, దేనితో పోల్చలేని అనుభూతి. టియి పర్వతం పర్వతారోహణ, రాళ్ళను ఎక్కడం వంటి సాహసోపేతమైన క్రీడలకు కూడా ఒక అద్భుతమైన ప్రదేశం. రాళ్ళు పొడిగా ఉండి, ఇటువంటి కార్యకలాపాలకు అనువుగా ఉండే వేసవి కాలంలో రాళ్ళను ఎక్కే అనుభూతిని పొందటానికి అనేక మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు.



Click it and Unblock the Notifications