అగర్తలా నగర కేంద్రం నగరం నడి బొడ్డున నగరానికి గుండె కాయలా వుంటుంది. ప్రణాళిక ప్రకారం ఏర్పడిన నగరం కావడంతో నగర కేంద్రం చాలా పరిశుభ్రమైన ప్రదేశంలో రోడ్డుకి ఇరువైపులా దుకాణాలతో తీర్చి వుంటుంది. అగర్తలా ఈశాన్య భారతం లోని రెండో అతి పెద్ద నగరం కావడం వల్ల చాలా బహుళ జాతి బ్రాండ్లు, పెద్ద కంపెనీలు ఇక్కడ దుకాణాలు తెరుస్తున్నాయి. దీంతో ఈ నగరం ఎప్పుడూ హడావిడిగానే వుంటుంది. ప్రధాన షాపింగ్ మాల్, అగర్తలా పురపాలక సంఘం కార్యాలయం ఇక్కడి ప్రధానమైన వాటిలో కొన్ని.
ఈ మధ్యనే, అగర్తలా నగర కేంద్రాన్ని మరే నగరంలోనూ లేని విధంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. 50 కిలోవాట్ ల సామర్ధ్యం కల సౌర విద్యుత్ ప్లాంట్ ను స్థాపించి నగర కేంద్రాన్ని విద్యుదీకరించారు. ఇలాంటి అరుదైన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అగర్తలా నగర కేంద్రం దేశంలోనే మొదటి సౌర నగరంగా ప్రసిద్ది పొందుతుంది.



Click it and Unblock the Notifications