1919 లో అగర్తలా సందర్శించినప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ నివసించిన ఇల్లు మలంచా నివాస్. టాగోర్ కు త్రిపుర రాజులతో సత్సంబంధాలు ఉండేవని అంటారు, వారి ఆహ్వానం పై ఆయన చాలా సార్లు త్రిపురకు వచ్చారు. 1919 లో అలాగే ఒకసారి వచ్చినప్పుడు ఆయన, మహారాజ బీరేంద్ర కిషోర్ మాణిక్య బహదూర్ ఏకాంత వాసంగా వుండే కున్జబాన్ ప్రాసాదం పక్కనే వున్న ఒక కచ్చా ఇంట్లో బస చేసారు. ఈ కచ్చా ఇల్లు తరువాత సుప్రసిద్ధమైంది (కాబీగురు కు అధికారిక విడిది గృహంగా వున్నందుకు) ఇప్పుడు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ కచ్చా మలంచా నివాస్ ఇప్పుడు పడేశారు, దాని స్థానంలో రెండంతస్తుల పక్కా భవనం నిర్మించారు. అయితే 1919 లో రవీంద్రనాథ్ టాగోర్ అగర్తలా సందర్శించినప్పుడు మలంచా నివాస్ అంత ప్రసిద్ది పొందలేదు. ఈ పక్కా భవనం నిర్మించాక దీనికి మలంచా నివాస్ అనే పేరు పెట్టారు.



Click it and Unblock the Notifications