తనదైన శైలిలో ఏకైక పార్క్ అయిన నెహ్రూ పార్క్ అగర్తలా లో చాలా భూభాగాన్ని ఆక్రమించుకుని వుంది. నగరానికి ఉత్తరాన వున్న నెహ్రూ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెహ్రూ పార్క్ లోపల అసంఖ్యాకమైన మొక్కలు, పొదలు, పూలు ఎదిగి, పూస్తాయి. నిజానికి మామూలు మొక్కల వెంటే అద్భుతమైన పూల మొక్కలు పెరిగే అరుదైన ప్రదేశం ఇది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చక్కగా నిర్వహించడం వల్ల ఇది అగర్తలా లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఎదిగింది.
అయితే నెహ్రూ పార్క్ అంటే కేవలం చెట్లూ, పూలే అనుకునేరు! అందమైన చెరువులు, ఫౌంటెన్ లు ఈ పార్క్ ప్రాకృతిక అందాన్ని ఇనుమడింప చేస్తాయి. అగర్తలా లోని హడావిడి మధ్య ఈ పార్క్ లో సాయంత్రం షికారు చేస్తే అగర్తలా నగరం లో ఆ రోజు చక్కగా గడిపినట్టవుతుంది. ఇలాంటి వ్యాహ్యాళి శరీరాన్ని, మనస్సుని ఆహ్లాద పరుస్తుంది.