అగర్తలా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న పట్టణం పిలక్. 7, 8 శతాబ్దాలకు చెందిన ఇక్కడి పురావస్తు అవశేషాలకుఈ పట్టణం ముఖ్యంగా ప్రసిద్ది పొందింది. హిందువులు, బౌద్ధులకు పిలక్ ప్రసిద్ధ తీర్థ యాత్రా స్థలం. పిలక్ దక్షిణ త్రిపుర లోని బెలోనియా సబ్-డివిజన్ లోకి వస్తుంది. ఇక్కడి అవశేషాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప, సజీవమైన సంస్కృతి విలసిల్లేదని సూచిస్తుంది. ఇక్కడి అవశేషాలలో టేర్రాకోటా తో చేసిన హిందూ బౌద్ధ శిల్పాలు వున్నాయి. ఈ టెర్రాకోటా ఫలకాలకు స్థూప శైలిలో చేసిన పైకప్పులు కూడా వున్నాయి, బహుశా ఇవి అవలోకితేశ్వరుడు, నరసింహుడు అనే హిందూ దేవతలవి కావచ్చు. ఈ సాక్ష్యాలు ఇక్కడ హిందూ, బౌద్ధ మతాలలోని వివిధ శాఖల వారు ఇక్కడ సహజీవనం చేసారని తెలియచేస్తాయి.అగర్తలా 100 కిలోమీటర్ల దూరంలో వుంది కనుక బస్సులు, టాక్సీలలో పిలక్ చేరుకోవచ్చు. కుమార్ ఘాట్ ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్ కాగా అగర్తలా సమీప విమానాశ్రయం.