చేతి వృత్తులకు, చేనేత ఉత్పత్తులకు త్రిపుర బాగా ప్రసిద్ది. నిజానికి ఈ రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యుత్తమ వెదురు ఉత్పత్తులు వెలువడతాయి, బాగా గిరాకీ కూడా వుంది. రాష్ట్రంలోని చేతివృత్తులు, చేనేత ఉత్పత్తులకు కేంద్ర నిధిగా త్రిపురా చేనేత, చేతివృత్తుల అభివృద్ది సంస్థ (THHDC) పని చేస్తోంది. పుర్బాసా గా కూడా పిలుఅవబడే THHDC కళాకృతులన్నిటికీ కేంద్ర నిధి. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ సంస్కృతుల మేళవింపు కల వెదురు, చెక్క ఉత్పత్తులు త్రిపురకే ప్రత్యేకం. THHDC 200 కు పైగా రకాల హస్తకళాకృతులను చేయిస్తుంస్తుంది, దీని ద్వారా 10,000 మంది నిపుణులైన పనివారు ఉపాధి పొందుతున్నారు.
ఈ కళాకారులు ప్రత్యేకంగా అంతర్గత అలంకరణ లో నైపుణ్యం కల వారు – రకరకాల ఫాల్స్ సీలింగ్ లు, కుండ జాడీలు, ఫలకాలు, పానేళ్ళు, పార్టిషన్లు తయారు చేస్తారు. ప్రతి వస్తువుకు క్లిష్టమైన అలంకరణ, చెక్క లేదా వెదురు తో మంచి పనితనం వుంటాయి. పుర్బాసా ను ఒకసారి చూస్తె త్రిపుర కళా నైపుణ్యం కళ్ళకు కడుతుంది.



Click it and Unblock the Notifications