అగర్తలా నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వున్న సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం పచ్చదనానికి విస్తారమైన మైదానాలకు ప్రసిద్ది పొందింది. ఇది 18.5 చదరపు కిలోమీటర్ల మెర వ్యాపించి వలస పక్షులకు, జంతువులకు నెలవుగా ఉంటోంది.
ఈ వన్యప్రాణి అభాయారన్యాన్ని 1972 లో నిర్మించారు, ఈ కొద్ది సంవత్సరాల్లో ఇది ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణగా పేరుపడింది. ఇక్కడ 150 కు పైగా జాతులపక్షులు ఉంటాయని అంటారు, వీటిలో చాలా వరకు వలస పక్షులే. ఇక్కడి దట్టమైన అడవితో పాటు సేపహిజల వన్యప్రాణి అభయారణ్యంలో ఒక జింకల పార్కు, సరస్సులు కూడా వున్నాయి.
ఇక్కడ నివసించే జంతువుల రకాలను బట్టి ఈ వన్యప్రాణి అభయారణ్యం అయిదు భాగాలుగా విభజించారు. అవి మాంసాహారులు, క్షీరదాలు, గోళ్ళు లేక గిట్టలుండే జంతువులూ, సరీసృపాలు, పక్షి విభాగాలు. సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం లో సహజంగా ఏర్పడ్డ రెండు సరస్సులు కూడా వున్నాయి, అవి అబసారిక, అమృత సాగర్ – రెండిట్లో బోటింగ్ సౌకర్యాలు వున్నాయి. అభాయారణ్య౦లోనే ఒక విశ్రాంతి మందిరం కూడా వుంది.



Click it and Unblock the Notifications