శివ, బ్రహ్మ మరియు విష్ణు దేవుళ్ళ దేవాలయ సముదాయాన్ని హుచ్చిమల్లి గుడి అంటారు. దీనిని 7వ శతాబ్దంలో నిర్మించారు. ఐ హోళే లో పురాతన దేవాలయం కనుక పర్యాటకులు తప్పక చూడాలి. గర్భగుడి, గోడలకు ఉత్తర భారత శైలి కిటికీలు కనపడతాయి. ప్రదక్షిణ మార్గం కలదు. ప్రధాన గుడిని కలుపుతూ వెనుక భాగంలో అందమైన ఒక అర్ధ మంటపం ఉంటుంది.
హుచ్చిమల్లి గుడి ఉత్తర భాగంలో 11వ శతాబ్దం నాటి ఒక చిన్న గుడి కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications