ఐహోళే దర్శించే పర్యాటకులు యెనియార్ దేవాలయాలకు దక్షిణంగా కల రామలింగ గ్రూప్ దేవాలయాలు తప్పక చూడాలి. రామలింగ దేవాలయం త్రికుటాచల నమూనాలో ఉంటుంది. ఇక్కడి సముదాయంలో ఇది ప్రధానమైనది. ఈ దేవాలయం రెండు గదులలో శివలింగాలుంటాయి. పార్వతి విగ్రహం మూడవ దానిలో ఉంటుంది.
ఈ దేవాలయం క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించిందిగా చెపుతారు. రామలింగ గ్రూపు దేవాలయాలు మలప్రభ నది ఒడ్డున కలవు. ఇక్కడే ఒక చిన్న మసీదు కూడా కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చిలలో రధోత్సవం జరుగుతుంది.



Click it and Unblock the Notifications