అడాయి దిన్ కా ఝోప్రా అనేది ఒక మసీదు, దీని వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. దీనిని కేవలం రెండున్నర రోజులలో నిర్మించారని నమ్ముతారు. మొదట్లో సంస్కృత కళాశాలగా వున్నఈ భవనాన్ని క్రీ.శ.1198 లో మొహమ్మద్ ఘోరీ మసీదుగా మార్చాడు.
ఈ మసీదులో 7 తోరణాలు కలిగిన గోడచుట్టూ ఖురాన్ చెక్కబడింది. ఇది హేరాట్ కు చెందినా అబూ బకర్ రూపకల్పన చేసిన ఈ మసీదు తొలి తరం ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. తరువాత క్రీ.శ. 1230 లో, సుల్తాన్ అల్తాముష్ ఒక ఎత్తైన ఆర్చి క్రింద జాలీ (తెర) నిర్మించాడు. ఉత్తరం వైపు ఉన్న ద్వారం మసీదుకి ప్రవేశ ద్వారం. ముందు ముఖభాగం పసుపు రంగు రాయితో చేసిన అనేక తోరణాలతో నిర్మించబడింది. ప్రధాన ఆర్చ్ కి పక్కన ఆరు తోరణాలు, దీప వ్యవస్థకు ఉపయోగించే అనేక చిన్న దీర్ఘచతురస్రాకార డోప్పలు ఇక్కడ చూడవచ్చు.
ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా పురాతన అరబిక్ మసీదులలో కనిపిస్తాయి. ఈ భవనం లోపల వున్న ప్రధాన మంటపంలో చాలా వరుసలు ఉన్నాయి. ఈ కట్టడం ఎత్తు పెంచడానికి స్తంభాలను ఒక దాని పై ఒకటి ఉంచారు. ఈ వరుసలకు విశాలమైన అడుగుభాగాలతో నిర్మించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ వరుసలు తగ్గుతాయి.



Click it and Unblock the Notifications