Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అలంగుడి

అలంగుడి  – గురుగ్రహ దేవాలయం !

5

అలంగుడి – తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది బృహస్పతి లేదా గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి. అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్ ఆలయానికి ప్రసిద్ది చెందింది. సందర్శకులు కుంబకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.

అలంగుడి చరిత్ర

పవిత్ర స్థలమైన శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ఆపత్సహాయేశ్వరార్ గా పేరుగాంచిన శివుని విగ్రహం ఉంది. ఇక్కడ పార్వతీ దేవిని ఏలావర్కుళలి లేదా ఉమై అమ్మాయి అని పిలుస్తారు. ఒకప్పుడు అసురులు, దేవతలు “పాలకడలి” ని చిలకడానికి ప్రయత్నించారు. వారు అమృతం కోసం ‘వాసుకి’ అనే పాముని ‘మందర’ పర్వతానికి తాడువలె చుట్టి లాగారు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు పాము వదలిన విషాన్ని మింగాడు. అందువలన, శివుడు ఆ విషంనుండి ప్రపంచాన్ని రక్షించడం వల్ల “ఆపత్సహాయేశ్వర్” అంటే “రక్షకుడు” అని అర్ధం, అలా ఈ ప్రదేశం ‘అలంగుడి’ గా ప్రసిద్ధిచెందింది.

ఇక్కడ శివుడిని పూజించడమే కాకుండా, దూరం నుండి, సమీపం నుండి అనేకమంది ప్రజలు బృహస్పతి లేదా గురు గ్రహం (జుపిటర్ గ్రహం) దోషాలను పోగొట్టుకోవడానికి పూజలు చేయడానికి, ప్రతి ఏటా గురువు మారినపుడు కూడా, పెద్ద సంఖ్యలో అలంగుడికి వస్తారు, వర్షాలు కురవడానికి, దురదృష్టాన్ని పారద్రోలడానికి ఎంతో భక్తీతో దేవుడిని ప్రార్ధిస్తారు.

సమీపంలోని ఆలయాలు – అలంగుడిలోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు మిగిలిన 8 నవగ్రహ స్థలాలు లేదా ఆలయాలన్నీ, అంటే, తిరునల్లార్ (సాటర్న్ లేదా శని), కన్జనూర్ (వీనస్ లేదా శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సన్ లేదా సూర్యుడు), తిరువెంకడు (మేర్క్యూరి లేదా బుధుడు), తిరునాగేశ్వరం (రాహువు), తిన్గలూర్ (మూన్ లేదా చంద్రుడు), కీజ్పెరుమ్పల్లం (కేతువు) అలంగుడికి సమీపంలో ఉన్నాయి (జుపిటర్ లేదా గురు గ్రహం ఉన్న ఆలయం తొమ్మిది నవగ్రహ స్థలాలలో ఒకటి).

అలంగుడి చేరుకోవడం ఎలా అలంగుడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబకోణం ప్రధాన రైల్వే స్టేషన్, నీదమంగళం మరో రైల్వే స్టేషన్. యాత్రీకులు కుంబకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు. అలంగుడిలో వాతావరణం అలంగుడి లో వాతావరణం వేడిగా ఉంటుంది.

అలంగుడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలంగుడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలంగుడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అలంగుడి

  • రోడ్డు ప్రయాణం
    కుంబకోణం నుండి మనర్గుడి వెళ్ళే బస్సులు అలంగుడి లో ఆగుతాయి. కుంబకోణం నుండి చాలా టాక్సీలు అందుబాటులో ఉంటాయి కనుక పర్యాటకులు టాక్సీలలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కుంబకోణం నుండి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడుపుతుంది. చిదంబరం, తీరిచి, చెన్నై నుండి పర్యాటకులు నిత్యం నడిచే బస్సుల ద్వారా కుంబకోణం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఆలంగుడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో వున్న నీదమంగళం ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. కుంబకోణం మరో ప్రధాన స్టేషన్. తమిళనాడు లోని అన్ని ప్రధాన పట్టణాలు, బెంగళూరు, చెన్నై ల నుంచి కుంబకోణం కి చాల రైళ్ళు వున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కుంబకోణం సమీపంలోని తిరుచిరాపల్లి ప్రధాన విమానాశ్రయం. కుంబకోణం నగరం నడిబొడ్డునుండి షుమారు 87 కిలోమీటర్ల దూరంలో త్రిచినపల్లి విమానాశ్రయం ఉంది. ఆలంగుడి కి వాయుమార్గం లో చేరాలనుకునే వారు వివిధ ప్రధాన నగరాల నుంచి తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకోవాలి. ఇక్కడి నుంచి కుంబకోణం కి బస్ లేదా టాక్సీలలో చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో బస్సు లేదా టాక్సీలో ఆలంగుడి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed