"రైస్ బౌల్ అఫ్ కేరళ" గా ప్రసిద్ది చెందిన కుట్టనాడ్ కేరళ లో ని గ్రామీణ అందాలతో సుసంపన్న మైన ప్రాంతం. బంగారు కాంతులీనే వరి పొలాలు సహకారాన్ని కోరుకునే ఒక సున్నితమైన స్త్రీని తలపిస్తే నిటారుగా నించుని ఉన్న పొడవాటి కొబ్బరి చెట్లు సంరక్షణని అందిస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇటువంటి అద్భుతమైన ఎన్నో దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి.
అచన్కోవిల్, మణిమాల మీణచిల్ మరియు పంపా నదులు ఈ ప్రాంతంలోకనిపిస్తాయి. ఈ నదీ జలాలు రోజు వారీ పనులకి మరియు పొలాల సేద్యానికి ఉపయోగపడుతాయి అనడంలో ఆశ్చర్యం లేదు. కాలువల ఒడ్డున ఉండే ఇళ్ళకు పడవలపై కూరలు, చేపలు, నిత్యావసర వస్తువులు అమ్ముతారు.
కుట్టనాడ్ ప్రాంతం పట్టణ ప్రాంతంలో నివాసితులకి ఒక పట్టు విడుపును ప్రసాదించే ప్రశాంతమైన , మనోహరమైన ప్రదేశం. స్థానికులకి కూడా ఇది ఆటవిడుపు ప్రదేశం. ఒక పడవని అద్దెకి తీసుకుని కుట్టనాడ్ లో చేసే ప్రయాణం అద్భుతమైన అనుభవం కలిగిస్తుంది. ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలకి జల మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడినది. అందువల్ల కేరళ లో ఉన్న వేరే ప్రాంతాలకి కూడా ఇక్కడ నుండి సులభంగా పర్యటించవచ్చు.



Click it and Unblock the Notifications