క్రైస్తవుల పుణ్యక్షేత్రాలలో సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ప్రధానమైనది. మొదటి శతాబ్దంలో సెయింట్ సెబాస్టియన్ ఈ చర్చ్ ని నిర్మించారని అంటారు. సెయింట్ సెబాస్టియన్ చే నిర్మించబడిన ఏడు చర్చ్ ల లో ఈ చర్చ్ కి ప్రముఖ చరిత్ర ఉంది. అర్తున్కల్ పెరున్నల్(అలెప్పి లో ఉన్న ఒక గ్రామం పేరు అర్తున్కల్, పెరున్నల్ అంటే విందు) ఇక్కడ ప్రధానంగా జరుపుకునే పెద్ద పండుగ. సెయింట్ సెబాస్టియన్ గౌరవార్ధం పది రోజుల ఈ పండుగని జరుపుకుంటారు. సెయింట్ సెబాస్టియన్ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న బీచ్ కి ఉరేగింపుగాతీసుకువెళ్ళి రావడం ఇక్కడ జరుపుకునే ఉత్సవాలలో భాగం.
ప్రాచిన సంప్రదాయుం ప్రకారం కొందరు భక్తులు బీచ్ నుండి పొర్లు దండాలతో అల్తార్ వరకు వచ్చి సెయింట్ సెబాస్టియన్ ని ఊరేగింపుకి వినమ్రంగా ఆహ్వానిస్తారు. ఆ తరువాత ఉత్సవం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండుగ సమయంలో ఒక డేగ ఆకాసంలో చక్కర్లు కొడుతుంది. ఈ డేగ ద్వారా ఆశీర్వచనాలు దేవుడు పంపిస్తాడని నమ్మకం. ప్రతి సంవత్సరం జనవరి లో ఈ పండుగని జరుపుకుంటారు. అలెప్పి నుండి ఈ చర్చ్ 23 కిలో మీటర్ల దూరంలో ఉంది. రవాణా పరంగా సదుపాయం కూడా అందుబాటులో ఉంది.