హిందువుల దేముడు శివుడిని ఇక్కడ బిన్సార్ దేవ్ అంటారు. ఆయన పేరుతో ఈ ఈ ప్రదేశం వెలిసింది. ఈ ప్రాంతం చాంద్ రాజులకు వేసవి విడిదిగా వుండేది. ఈ ప్రదేశంకు వెనుక భాగంలో హిమాలయ పర్వత శ్రేణులు కనపడతాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 2400 మీ.ల ఎత్తున ఝాండి దార్ హిల్స్ లో కలదు. కుమావొన్ ప్రాంతంలో ఈ ప్రదేశం అత్యధిక ఎత్తు కలది. సమీపం లో ఒక శివాలయం వుంటుంది. కేదార్నాథ్, శివ్లింగ్, త్రిశూల్, నందా దేవి వంటి హిమాలయ శిఖరాలను ఇక్కడ నుండి చూసి ఆనందించవచ్చు.