ఔరంగాబాద్ గుహలు బీబీ కా మక్ బారా కు సమీపంలో కలవు. అద్భుతమైన ఈ గుహలు బౌధ్ధమతానికి సంబంధించినవి. వీటిని సుమారు క్రీ.శ 2వ మరియు 7వ శతాబ్దాలలో కనుగొన్నారు.
మొత్తంగా ఇక్కడ 7 గుహలు కలవు. వీటిని రెండు ప్రదేశాలుగా విభజించారు. మొదటి అయిదు గుహలు పశ్చిమ గ్రూప్ గుహలుగాను చివరి అయిదు గుహలను తూర్పు గ్రూప్ గుహలుగా విభజించారు. వీటిలో నెం.3 మరియు 7 గుహలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి రూపకల్పన హిందూమత తంత్ర శైలిలో కలదు.
గుహ దర్శించాలంటే ప్రవేశ రుసుము భారతీయులకు రూ.10 గాను విదేశీయులకు రూ.100 గాను కలదు. ఉదయం 9 గం. ల నుండి సా.5 గం.ల వరకు దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications