హరిద్వార్ లో ని హర కి పైది లాగా రామ్ కి పైది అయోధ్య లో ని సరయు నది ఒడ్డున నయఘాట్ మీద ఉంది. ఎంతో మంది భక్తులు ఈ చరిత్మత్మక నదిలో ని పవిత్ర జలాలతో స్నానం చేస్తారు.
అసలైన మెట్లు వర్షాల మూలకంగా నది యొక్క అలల తాకిడికి కొట్టుకుపోయాయి. యు పి యొక్క ముఖ్యమంత్రి అయిన శ్రీ శ్రీపతి మిశ్రా మరియు నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ వీర్ బహదూర్ సింగ్ యొక్క కృషి వల్ల మెట్లతో ఉన్న ఒక కొత్త ఘాట్ ని 1984 - 1985 మధ్యలో నిర్మించారు.
సరయు నది నుండి నీటి ని ఈ ఘాట్ కి మోటార్ పంపుల ద్వారా తరలిస్తారు. యు పి ప్రభుత్వ నీటి పారుదల శాఖ యొక్క ఫ్లడ్ వర్క్స్ డివిజన్ వారు నిరంతరాయ నీటి సరఫరా మరియు ఈ ఘాట్ యొక్క పర్యవేక్షణ ను చూసుకుంటున్నారు.
శ్రీ రాముని యొక్క అనేక భక్తులను పండుగ దినాలలో ఈ రామ్ కి పైడి విశేషం గా ఆకర్షిస్తుంది. ఇక్కడి సరయు నదిలో స్నానం చెయ్యడం ద్వారా వారి వారి పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications