7వ శతాబ్దంలో కళ్యాణ్ చాళుక్య నిర్మించిన బణశంకరి దేవాలయం కనపడుతుంది. చాళుక్యుల కులదేవత దేవి పార్వతి అవతారమే బణ శంకరి ఈ దేవత దుర్గమాసుర అనే రాక్షసుని వధించిందని స్కంద మరియు పద్మ పురాణాలలో చెపుతారు. బణశంకరి దేవాలయంలో దేవత బ్లాక్ స్టోన్ తో చెక్కబడింది. మాత ఒక సింహంపై కూర్చొని ఒక రాక్షసుడిని తన కాళ్ళకింద నలిపివేస్తున్న మూర్తి కనపడుతుంది. ఆమె చేతిలో ఒక త్రిశూలం, ఘంట, కమలపత్ర, డమరుగం, ఖడ్గం, వేదాలు మొదలైనవి ఆమె ఎనిమిది చేతులలో ఉంటాయి. బణశంకరి దేవాలయాన్ని మొదటగా 7వ శతాబ్దంలో నిర్మించారు. తదుపరి 17 వ శతాబ్దంలో మరాఠా వీరుడు పరశురాం అగాలే దానిని పునర్నించారు. పురాతన దేవాలయం ద్రవిడ శైలిలో ఉండేది. ఈ దేవాలయాన్నికి అక్కడి స్ధానికులు పుష్యమాసంలో రధోత్సవం చేస్తారు. ఇది జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో వస్తుంది. పర్యాటకులు ఈ సమయంలో దీనిని చూసి ఆనందించవచ్చు. తిలకారణ్య అడవులలో ఉన్న ఈ దేవాలయం రెండు పదాలు అంటే బన్ మరియు శంకరి గా సంతరించుకొంది. బన్ అంటే అడవి అని శంకరి అంటే మాత లేదా పార్వతి అని చెపుతారు.



Click it and Unblock the Notifications