కర్ణాటక హై కోర్ట్ భవనం సాంప్రదాయ భవన నిర్మాణ శైలికి సుప్రసిద్ధం. బెంగళూరు లోని అంబేద్కర్ వీధిలో రాష్ట శాసన సభ భవనం, విధాన సౌధ ఎదురుగానే ఈ ప్రాంగణం వుంటుంది. అట్టర కచేరి గా పిలవబడే ఈ ప్రాబ్గానం ఎర్రటి ఇటుక రాయి తో నిర్మించారు.
పూర్వం మైసూర్ రాజ్యంగా పిలవబడిన కర్ణాటక హై కోర్ట్ 1884 లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గా ఏర్పడింది. 1921 లో దీనికి కర్ణాటక హై కోర్ట్ గా నామకరణం చేశారు. అట్టర కచేరి అంటే పద్దెనిమిది కార్యాలయాలు అని అర్ధం. ఆధునిక సాంప్రదాయ నిర్మాణ శైలికి ఈ భవనం చక్కటి తార్కాణం.అంతకు ముందు ‘పాత ప్రభుత్వ భవనాలు’ గా పిలవబడ్డ ఈ భవనాలకు – టిప్పు సుల్తాన్ భవనం నుంచి ఇక్కడికి పద్దెనిమిది ప్రభుత్వ శాఖల కార్యాలయాలు మార్చాక అట్టర కచేరి గా పేరు మార్చారు. ఈ భవనం శిధిలావస్థ లో వుండగా ప్రజాహితార్ధం ఒక బిల్లు పాస్ అవడంతో ఈ భవనాలను కాపాడగలిగారు.



Click it and Unblock the Notifications