Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు » వికాస సౌధ

వికాస సౌధ, బెంగళూరు

3

వికాస సౌధ బెంగళూరు లోని అద్భుత దృశ్యాల్లో ఒకటి. కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన భావనల్లో కల్లా అత్త్యుత్తమమైనది ఇది. విధాన సౌధ కు అనుబంధం గా 2005 లో ప్రారంభమైన ఈ వికాస సౌధ లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి నిర్మించారు. మాజేస్టిక్ స్టేషన్ లాంటి చోట్ల నుంచి ప్రభుత్వ బస్సులు, మెట్రో సర్వీసులు నడుస్తుండడం వల్ల ఇక్కడి చేరుకోవడం చాల తేలిక.ఓ వంక ఆధునికంగా కనపడుతూనే సంప్రదాయ దక్షిణాది నిర్మాణ శైలి వైశిష్ట్యాన్ని కలిగి వుండడం ఈ విధాన భవన౦  ప్రత్యేకత.8 ఎకరాల విస్తీర్ణంలో 58274 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది. ఈ భవనం మొత్తం ఖరీదు దాదాపు 150 కోట్లు వుంటుందని అంచనా. 8 అంతస్తుల్లో విస్తరించి వున్న ఈ భవనం లో పదిహేను సమావేశ మందిరాలు, మూడు వందల యాభై గదులు వున్నాయి. వికాస సౌధ నిర్మాణానికి చాల ఏళ్ళు పట్టింది, అంతర్గతంగా చెక్కతోను, బయటి గోడలకు రాతి శిల్పాల తోనూ ఈ భవనం అద్భుతంగా తీర్చి దిద్దారు. దేశం లోని ఇతర విధాన భవనాల కన్నా ఈ పెద్ద భవనం లో అత్యాధునిక సౌకర్యాలు వున్నాయి.ఈ భవనం మూడు అంతస్తుల్లో 600 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తమ స్థాయి భద్రతా వ్యవస్థను నెలకొల్పింది. ఆధునిక నిర్మాణ శైలి, అధునాతన అంతర్గత హంగులు, పటిష్టమైన భద్రతా వ్యవస్థ తో పాటు పర్యావరణ హితంగా వుండేలా దీన్ని తీర్చి దిద్దారు. సౌర విద్యుత్ కోసం అదనపు గ్రిడ్, వాన నీటి సంరక్షణ విధానం ఇటువంటి రూపకల్పనకు తార్కాణాలు.ఈ అద్భుత భవనం చూస్తూ గడిపే సమయం మిమ్మల్ని నిరాశ పరచదు సరికదా మీకు కనుల విందు చేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed