బన్స్వారా నగరంలోని తూర్పు భాగం లోని కొండమీద ఏర్పడ్డ సహజమైన గుహలో ఉన్న దేవాలయమే మదారేశ్వర శివాలయం. ఇది గుహలో ఉన్న శివాలయం కావడంతో భక్తులు ఇక్కడికి రావడాన్ని అమర్నాద్ యాత్రతో పోల్చుకుంటారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. బనేశ్వర్ దేవాలయంలో అంతమయ్యే కావడి యాత్రకు ఈ దేవాలయాన్ని ప్రారంభ కేంద్రంగా భావిస్తారు. పాదయాత్ర గా వెళ్లి మహీ నది నీరు తెచ్చి ఇక్కడి శివాలయంలో పూజ చేస్తారు. బన్స్వారా జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి టాక్సీలు, ద్విచక్ర వాహనాల ద్వారా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications