Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » ఆకర్షణలు » దూపెశ్వర్నాథ్ ఆలయం

దూపెశ్వర్నాథ్ ఆలయం, బరేలి

0

దూపేశ్వరనాథ్ ఆలయస్థలానికి, మతపరమైన మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నది. ఈ స్థలంలో మహాభారతంలోని ముఖ్య పాత్ర అయిన ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడు శివుని ఆశీర్వాదంతో జన్మించారు.

గ్రంథాల ప్రకారం, రిషి ఆర్తి శిష్యుడైన రిషి ధూమ్ ముందు శివుడు, శివలింగారూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఈ ఆలయస్థలం శివునికి అంకితం చేయబడింది. రిషి ఆర్తి ఇక్కడ చాలా కాలం వరకు శివుని గూర్చి తపస్సు చేశాడు మరియు పూజించాడు.

దూపేశ్వరనాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడింది మరియు ఇది నగర కంటోన్మెంట్ ప్రాంతంలో కట్టబడింది. ఒక పురాతనమైన సొరంగం లేదా గుహ ద్వారా ఈ ఆలయంలోని దూపెశ్వరనాథుని విగ్రహాన్ని దర్శించాలి.

అది ఒక చిన్న సొరంగం అయినప్పటికీ మోకాలి లోతు నీటితో నిండి ఉంటుంది మరియు భక్తులు పూజించే భగవంతుని దర్శనం కొరకు దీని గుండా నడచి వెళతారు. ఈ ఆలయ సముదాయంలో ఒక పెద్ద నీటి చెరువులాంటిది ఉన్నది. దీనిలోని నీరు శరీర వ్యాధులను నయం చేస్తుందని అంటారు.

బరేలిలో ఉన్నఅతిపురాతన దేవాలయాల్లో దూపెశ్వరనాథ్ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం చెడు శక్తుల నుండి నగరాన్ని రక్షిస్తుందని, దీనిని 'రక్షా కవచ్' అని భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri