Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు » కేవల్ దేవ్ నేషనల్ పార్క్

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్

5

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. షుమారు 250 సంవత్సరాల కిందట సూరజ్ మాల్ మహారాజు నిర్మించిన ఈ పార్క్ ని కేవల్ దేవ్ ఘనా నేషనల్ పార్క్ అనికూడా అంటారు. 1964 వరకు ఈ పార్కుని భరత్పూర్ మహారాజులు బాతు వేటకు నిలయంగా ఉపయోగించారు, తరువాత ఇది పక్షుల అభయారణ్యంగా ప్రసిద్దిచెందింది. 1982 లో భరత్పూర్ పక్షుల అభయారణ్యం కేవల్ దేవ్ ఘన నేషనల్ పార్కు పేరుతో ప్రకటించబడింది. 1985లో, ఈ పార్క్ యునెస్కో చేత ప్రపంచ సంప్రదాయ స్థలంగా గుర్తింపు పొందింది. ప్రతి ఏటా, పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రసిద్ధ నేషనల్ పార్కుని సందర్శిస్తారు. ప్రస్తుతం, ఈ పార్క్ లో 7 రకాల తాబేళ్లు, 50 రకాల చేపలు, 5 రకాల ఉభయచరాలూ ఉన్నాయి. అంతేకాక, ఈ పార్కు 375 రకాల పక్షులకు సహజ నివాసంగా ఉంది. వర్షాకాలంలో, దేశంలోని ప్రతి భాగం నుండి ఈ పార్క్ కు పక్షులు గుంపులుగా వస్తాయి. ఇక్కడ సాధారణం గా కనపడే పక్షి జాతుల్లో నీటి బాతులు, పొడవు మెడ బూడిద రంగు కాళ్ళు వుండే బాతులు, సన్న తోక పక్షులు, నీలిరంగు పిట్టలు, రడ్డీ షెల్ డక్ లు, మల్లార్డ్ లు, విడ్జియన్ లు, షోవేలర్ లు, సాధారణ షెల్ డక్ లు, ఎర్ర మెడ బాతులు, గడ్వాల్ బాతులు లాంటివి ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ ఇంపీరియల్ గద్దలు, స్టెప్పీ గద్దలు, మచ్చల గద్దలు, టానీ గద్దలు, మార్ష్ హారియర్స్, లాగర్ ఫాల్కాన్స్ లాంటి పక్షులు కూడా చూడవచ్చు. పక్షులతో పాటు ఇక్కడ నల్ల దుప్పులు, కొండచిలువలు, సామ్బార్లు, మచ్చల జింకలు, నీల్గాయి లు వంటి జంతు జాతులను కూడా చూడవచ్చుభరత్పూర్ నుంచి కేవల్దేవ్ నేషనల్ పార్క్ కు బస్సులు, రిక్షాలు, వాన్ లు కూడా దొరుకుతాయి. ఐతే, ఈ పార్క్ ను తెలుసుకోవాలంటే కాలినడకన గానీ, సైకిల్ లేదా రిక్షాల మీద వెళ్ళాలి. ఆసక్తి వున్న యాత్రికులు పార్క్ అధికారుల నుంచి సైకిళ్ళు సరసమైన ధరలకు అద్దెకు తీసుకొని తిరగవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue