బుద్గం జిల్లాలో ఉన్న పోష్కేర్ గ్రామం లో ఈ సమాధి ఉంది. లూడో రైనా గా పూర్వం పిలువబడిన బాబా లతీఫ్-ఉద్-దిన్ లు షేక్-ఉల్-ఆలం(RA) కి అమూల్యమైన శిష్యుడు. గ్రామాన్ని విడిచి కొన్నేళ్ళు బాబా మార్గ్ అనే గుహలో ఆతను తపస్సు చేసాడు. కొన్నేళ్ళ తరువాత అక్కడే ప్రాణాలు వదిలారు. బాబా యొక్క శరీరం కలిగిన శవపేటిక ఆశ్చర్యకరంగా పోష్కేర్ గ్రామానికి చేరుకుంది. ఆ తరువాత అక్కడే అతనిని పూడ్చి పెట్టారు. URS జరిగే సమయం లో ఈ సంధి కి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ప్రతి ఏడాది హిందువుల మాసం అయిన ఫాల్గుణ మాసం ఏడవ రోజున URS ని నిర్వహిస్తారు. ఖడ్గం వంటి బాబా కి సంబంధించినవి భక్తుల సందర్శనార్ధం ప్రదర్శనకి ఉంచుతారు.



Click it and Unblock the Notifications