Search
  • Follow NativePlanet
Share

చంఫాయి   -  మయన్మార్ వాణిజ్య ప్రవేశ ద్వారం !

18

గంభీరమైన మయన్మార్ హిల్స్ సమీపంలో వుంది, చక్కట్ సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవై ' మిజోరాం యొక్క రైస్ బౌల్ ' గా చెప్పబడే చంఫాయి ఈశాన్య భారత దేశ పర్యటనలో తప్పక చూడదగినది. ఈ ప్రదేశం అంతా గిరిజన సంప్రదాయాలతో తుల తూగుతూ వుంటుంది. అనేక అందమైన తోటలు, వాటిపై తిరిగే సీతా కోక చిలుకలు ఈ ప్రదేశ ఆకర్షణను మరింత పెంచుతూ, అద్భుత గాధలను తలపిస్తాయి.

చంఫాయి టవున్ నుండి అందమైన నీలి వర్ణ మయన్మార్ కొండలు చూడవచ్చు. జిల్లా లోని గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు కలిగి వుంటాయి. ఇక్కడి పురాతన స్మారకాలు, ఏకశిలా నిర్మాణాలు మిజో తెగల చారిత్రక ధైర్య సాహసాలను , సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతాయి.

మిజోరం లో చంఫాయి వేగంగా అభివృద్ధి చెందుతోంది. మయన్మార్ కు సమీప సరిహద్దు టవున్ గా వుంది ఇండియా - మయన్మార్ దేశాలకు వాణిజ్య ప్రదేశంగా వుంది.

చంఫాయి లోను, చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు

చంఫాయి టవున్ మయన్మార్ కు వాణిజ్య ప్రవేశ ద్వారంగానే కాదు, ఇండియా లో ఇంతవరకూ శోదిన్చాబడని ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మిగిలి పోయింది. ఈ ప్రదేశ అందాలను పెంచుతూ చుట్టూ మయన్మార్ కొండలు వుంటాయి. ఇక్కడకల ముర్లేన్ నేషనల్ పార్క్, మురా పూక్, రిహ్ దిల్ లేక్ , తసియామా స్నో నీహ్నా లు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.

చంఫాయి సాంస్కృతిక చరిత్ర

మిజో ల చరిత్ర చంఫాయి లో మొదలై అక్కడే ముగుస్తుందని చెపుతారు. మిజో ల చరిత్ర చెప్పే ఎన్నో పురాతన స్మారకాలు, శిధిలాలు కలవు. నేడు మిజోరం లో కల అనేక తెగలు గతంలో చంఫాయి నుండి బయటకు వచ్చి స్థిరపడిన వారే. సాగుకు అనువైన ఇక్కడి భూములను హమార్స్ నుండి రాల్తేస్ మరియు సిలో లు కూడా తమ స్వస్థలం గా ఒకప్పుడు చేసుకున్నారు.

చంఫాయి ఎలా చేరాలి ?

చంఫాయి పట్టణం మిజోరం రాజధాని అయిన ఐజావాల్ నుండి 192 కి. మీ. ల దూరం లో కలదు. మంచి రోడ్డు మార్గం కలిగి తరచు బస్సు లు నడుస్తాయి. ప్రైవేటు టాక్సీ లు కూడా లభ్యంగా వుంటాయి.

చంఫాయి వాతావరణం

చంఫాయి లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది. వేసవులు ఒక మోస్తరు వేడి, వింటర్ లో ఒక మోస్తరు చలి. అయితే మిజోరం లోని ఇతర ప్రాంతాల వలెనె, వర్ష పాతం అధికం.

చంఫాయి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చంఫాయి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చంఫాయి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చంఫాయి

  • రోడ్డు ప్రయాణం
    కోల్కతా , ఇంఫాల్ ల నుండి ఫ్లైట్ లో లేదా గువహతి నుండి ట్రైన్ లో ఇక్కడకు చేరవచ్చు. ఐజ్వాల్ కు సిల్చార్ నుండి టూరిస్ట్ బూస్ట్ లో చేరవచ్చు. ఐజవాల్ నుండి చంఫాయి కి రోడ్డు మార్గం లో ప్రయాణించాలి. ఐజవాల్ నుండి చంఫాయి కి రోడ్డు మార్గంలో నాలుగు గంటల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    మిజోరాం కు రైల్వే స్టేషన్ లేదు. కనుక అస్సాం లోని సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి 352 కి. మీ. ల దూరం లో కల చంఫాయి చేరవచ్చు. సిల్చార్ ఒక చిన్న స్టేషన్. నేరో గేజ్ లైన్ , లుం డింగ్ ద్వారా గువహతి చేరాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చంఫాయి కి సమీప ఎయిర్ పోర్ట్ ఐజవాల్ లో కలదు. ఇది 192 కి. మీ. ల దూరం. లెంగ్ పూయి ఎయిర్ పోర్ట్ నుండి గువహతి, కోల్కతా, అగర్తల, ఇంఫాల్ లకు డైలీ ఫ్లైట్ లు కలవు. ఫ్లైట్ చార్జీలు అధికం అయినప్పటికీ చంఫాయి వేగంగా చేరవచ్చు. ఎయిర్ పోర్ట్ నుండి చంఫాయి కి నేరుగా వాహనాలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue