చందేరి చరిత్రకి అలాగే వారసత్వానికి సంబంధించిన అవశేషాలను భద్రపరిచేందుకు ఏర్పాటయినదే ఈ చందేరి అర్కలాజికల్ మ్యూజియ. ఘనమైన సంస్కృతిక చరిత్ర మరియు పురాతత్వ వారసత్వం కలిగిన ప్రదేశం చందేరి. అద్భుతమైన కోటలు, పాలసులు, పెద్ద గేట్లు మరియు ఎన్నో స్మారక చిహ్నలకి నిలువెత్తు ఉదాహరణ చందేరి.
ఈ కట్టడాలు, స్మారక చిహ్నాలు వివిధ కాలాల్లో చందేరిని పాలించిన వివిధ పాలకులకు చెందినవి. అటువంటి ఘనమైన చారిత్రక స్మారక చిహ్నాలను సంరక్షించేందుకు ఈ మ్యూజియం ఏర్పాటయింది. ఏప్రిల్ 3, 1999 నుండి ఈ చందేరి మ్యూజియం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ స్మారక చిహ్నాలు ఇంకా చందేరీ లో స్థానిక ప్రజల దగ్గర ఇంకా కొంత మంది వ్యక్తుల దగ్గర లభించైనా శిల్పకళా వస్తువుల సేకరణలు ఈ మ్యుజియం కి ఆధారాలు.
శిధిలావస్తలో ఉన్న కోటలు ఇంకా చందేరీ లో ఇంకా చుట్టూ పక్కల ఉన్న ఆలయాలు మరియు బుద్ధి చందేరీలు పురాతన కాలానికి ఘనమైన ప్రతినిధులు.



Click it and Unblock the Notifications