పురాని అదాలత్ అంటే న్యాయస్థానం లేదా ధర్మాసనం అని అర్ధం. ఒకప్పుడు చందేరి లో వాడుకలో ఉన్న ధర్మాసనం ఇది. చందేరి యొక్క బందేలా పాలకులు చందేరి లో ఇంకా చందేరి చుట్టుపక్కల ఎన్నో ప్రముఖమైన నిర్మాణాలు చేసారు. అటువంటి వాటికీ చెందినది ఈ పురాని అదాలత్. చతురస్రాకారం లో ఉన్న ఈ భవనం రెండు అంతస్తులు కలిగినది.
ఈ రాతి కట్టడం చీలికలతో నిర్మించబడింది. ప్రవేశ మార్గం కోసం మూడు అంతస్తుల గేటు వే ఉంది. ఈ భవనం లో బాల్కనీలు ఉన్నాయి. ఈ ప్రవేశ మార్గం లో ఆకర్షణీయమైన అందం తో పాటు పై కప్పు పై విస్తృతమైన కలువ పువ్వు చెక్కడాలు కలవు. రేఖాగణిత ఆకృతుల తో ముందు గోడలు అలంకరించబడ్డాయి. తలుపు పై ఇరువైపులా ఏనుగుల బ్రాకెట్స్ ని గమనించవచ్చు. పై కప్పు వరకు బాల్కానీ విస్తరించబడి ఉంటుంది. రెండు దూలాల ప్రొజెక్షన్ ఈ నిర్మాణానికి మద్దతు పలుకుతుంది. ఈ భవనం యొక్క అందం ఇప్పటికీ పర్యాటకులని ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications