భద్ర జంతు సంరక్షణాలయ విభాగంలో ప్రసిద్ధి గాంచిన ముధోడి ఫారెస్ట్ కేంపు తప్పక చూడదగినది. ఇది చిక్కమగళూరు పట్టణానికి 32 కి.మీ.ల దూరంలో కలదు. ఈ శాంక్చురీలోని ఇతర భాగాలు తిగెబాయిలు, లక్కవల్లి మరియు హెబ్బీ లు కూడా ఆకర్షణీయమే.
ఈ కేంప్ లో వివిధ రకాల జంతువులను అంటే పులులు, సాంబార్, ఏనుగులు, మచ్చల జింకలు, వంటివి చూడవచ్చు. ఎన్నో రకాల పక్షులు కనపడతాయి. అటవీ శాక నిర్వహించే నేచర్ కేంప్ కు పర్యాటకులు హాజరు కావచ్చు. రాత్రి బసలకు గాను గుడారాలు, చెక్క కాటేజీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications