చివరగా గోవాలో పార్కింగ్ ప్రదేశ సమస్యలను తీర్చగల క్లబ్ ఏదంటే అది క్లబ్ మార్గరిటా అని చెప్పాలి. ఇది కూడా దక్షిణ గోవాలోని పరదిశో వలెనే వేటితో కలువకుండా ఒకటిగా ఉంటుంది. కోల్వా బీచ్ సమీపంలో ఉండి, ఎంత పొద్దు పోయినా సరే పార్టీలు కొనసాగించవచ్చనే పేరు పడింది. దీనిలో ప్రపంచంలోనే పేరు గాంచిన డిస్క్ జాకీలు కలదు.
మంచి ఆకర్షణీయ నియాన్ లైటింగ్ బార్ టేబుల్ కలిగినది. అంతే కాక, ఈ ప్రాంతంలో సింగల్ గా ఆనందించాలనుకునేవారికి అతి తక్కువ ధరలో అంటే 300 రూపాయలతో పని దినాలలో రూ.500 లతో వారాంతపు సెలవులలోను అందుబాటులో ఉంటుంది. విశాలమైన డ్యాన్స్ ఫ్లోర్ మాత్రమేకాక రుచికర ఆహారాలను అందించే వివిధ రకాల ఆహారాల రెస్టరెంట్ కూడా ఉంది. ఇక, కాక్ టెయిల్స్ మీ అభిరుచిని బట్టి ఎంపిక చేయవచ్చు.
ఒకే మాటలో చెప్పాలంటే, గోవాలో ఒక మెట్రోపాలిటన్ క్లబ్ అనుభవం పొందాలనుకుంటే, క్లబ్ మార్గరెటా తప్పక ఆనందించవలసిన ప్రదేశం. క్లబ్ మార్గరిటా కు చేరాలంటే, పణజిం, వాస్కో లేదా మర్గోవాలనుండి క్యాబ్ వినియోగించండి. మీరు కనుక నార్త్ గోవా లో బస చేసినవారైతే, దీనికి వెళ్ళాలంటే కొద్ది దూరమైనప్పటికి వయా కోల్వా బీచ్ చేరండి.



Click it and Unblock the Notifications